Sri Chitragupta Temple | Uppuguda | Hindu temples guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. సుమారు 450 సం| పురాతన ఆలయం. ఈ దేవాలయం కందికల్ గెట్ ఉప్పుగూడ వద్ద గలదు. మన దేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక చిత్రాగుప్త ఆలయం.
కాయస్థుల వంశస్తులు ఈ ఆలయం నిర్మించారు అని చరిత్ర. వీరు చిత్రాగుప్త కుటుంబ సభ్యులు. చిత్రాగుప్తునికి ఇద్దరు భార్యలు. ఒకరు ఐరావతి, ఒకరు దక్షిణతి. వీరికి మొత్తం 12 సంతానం.
ప్రతి వారం బుధవారం రోజున ప్రత్యేక అభిషేకం జరుపబడుతుంది. చెల్లెలు అన్నచిత్రాగుతునికి మాట కోసం తన కుటుంబ సభ్యులు మరియు సమాజం శ్రేయస్సు బాగా ఉండాలి అని కోరుకుంటుంది. ఈ మాటని చిత్రాగుప్తులు వారు యమధర్మ రాజుకు చెప్పగానే వారు తమ ఆశీర్వాదం అందిస్తారు. ఇక్కడ పూజలు నిర్వహిస్తే గ్రహ దోషాలు, పితృ దోషాలు తొలిగిపోతాయి అని ప్రజల విశ్వాసం.
ఈ ఆలయంలో శివాలయం , దుర్గాదేవి ఆలయం , సుబ్రమణ్య స్వామి ఆలయం , గణపతి ఆలయం , సాయిబాబా ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా కలవు. పండుగ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయం ప్రాంగణంలో పెద్ద భావి కలదు. అందులో నుంచి వచ్చే నీరుని పూర్వం అభిషేకం కోసం వాడేవారు. శ్రీ రామ నవమి, దసరా , దీపావళి , శివరాత్రి బాగా నిర్వహిస్తారు.
మాఘ మాసం , శివయ్యకి ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. హోమం కూడా చేస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం 05:30 నుంచి 12:00 వరకు
మధ్యాన్నం 12:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం 04:00 నుంచి 08:00 వరకు తెరిచి ఉంటుంది.
#Sri Chitragupta Temple #Uppuguda #Hyderabad Temples#Hindu temples guide

Comments
Post a Comment