Sri Balatripurasunari devi | Hindu temples guide
బాల త్రిపుర సుందరి దేవి :
ప్రపంచంలోని ప్రతి స్రి అమ్మ ప్రతి రూపమే. మొదట అమ్మవారు బాలగా వచ్చునని ప్రతీతి. త్రిపురిని భార్య అంటే ఈశ్వరుని భార్య ఐన గౌరి దేవి అని అర్ధం. మనస్సు బుద్ది , చిత్తం , అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి.
అభయ హస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాదీస్తే మానసిక బాధలు తొలిగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విధ్య కి ఈ అమ్మవారు అధి దేవత. కాబట్టి ఉపశకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాల అర్చన చేస్తారు. మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది.ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం.
లలిత సహస్ర నామం లో కూడా మనం ఈ అమ్మవారిని గురించి చూడవచ్చు. విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లికి దసరా లో మొట్ట మొదట ఈ అమ్మవరి అలంకారం చేస్తారు.
శ్రీ బాల త్రిపురసుందరి ధ్యాన శ్లోకం :
బాలా త్రిపుర సుందరి త్రిపురేశేయ్యచ విద్మహే
కామేశ్వరైి చ ధీమహి
తన్నో బాలా ప్రచోదయాత్.
పూజ ఫలితం ; అమ్మను భక్తి తో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. వృధి , ఆరోగ్యం ఇస్తుంది.
#Hindu temples guide #dasara, #balatripurasundari devi.

Comments
Post a Comment