Sri Mahalaxmi Devi | Hindu temples guide


ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి  అమ్మవారి అలంకారము.

శ్రీ మహాలక్ష్మీ దేవి.

అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, కమలాలను రెండు చేతులతో ధరించి, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


"యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా" అంతే అన్ని జీవులలోను ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది. 

కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. అమ్మవారికి వడపప్పు, చలివిడి నివేదన చేయాలి.


నైవేద్యం - వడపప్పు,క్షీరాన్నం.


ధ్యానమ్


వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం 

హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |

భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం

పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||

సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |

భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||

ఓం


శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం :


ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |

శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||

వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |

ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||

అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |

నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||

అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |

అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||

నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |

పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||

పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |

పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||

పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |

నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||

చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |

ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||

విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |

ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||

భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |

వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||

ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |

నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||

శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |

నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||

విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |

దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||

నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |

త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |

దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||

మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!

శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!

క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!

లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||

త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |

దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |

దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |

యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||

భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |

అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||

దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |

యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||

భుక్త్వాతు విపులాన్ భోగాన్ నస్యా సాయుజ్యమాప్నుయాత్ |

ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |

పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||

ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్.


#Hindu temples guide #Dasara 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana