Aashwayuja purnima | Hindu temples guide


 ఆశ్వియుజ పూర్ణిమ :

ఈ రోజు ఆశ్వీయుజ పూర్ణిమకే 'శరత్ పూర్ణిమ' అని పేరు. అమ్మవారి ఆరాధనకు, శివ అభిషేకం , విష్ణు సహస్రనామ స్తోత్రం , దక్షిణామూర్తి అభిషేకం , అరుణాచల గిరి ప్రదక్షిణకి చాలా విశేషమైన రోజు. సాధారణంగా అందరూ దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమనాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అని పూర్ణిమ కంటే ఈ రోజు చంద్రుడు మరింత కాంతి వంతంగా కనిపిస్తాడు. 

అందువల్ల ఈరోజు చంద్రుడిని పూజిస్తే ఎంతో పుణ్యం. ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. ఈ కిరణాలు శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువల్ల చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. 

చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెబుతోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న ఓషధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మర్నాడు ఉదయం పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించాలి.

శ్రీకృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరత్ పూర్ణిమను బృందావనంలో 'రాసపూర్ణిమ' అంటారు. శ్రీకృష్ణుడు ఈరోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్ణుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలో పరుగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేశారట. ఈ పూర్ణిమక కోశాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరి పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

ఈ రోజు నిండు పూర్ణిమ లో నందీశ్వరుడు మరియు శివయ్య కి అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది.  దీని వల్ల సమస్త లోక శాంతి లభిస్తుంది. 

#Purnima #Hindu temples guide 

Comments