Sri anantha padbhanabha swami | Vikarabad | Hindu temples guide


 వికారాబాదు సమీపంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కలదు. దీనిని అనంతగిరి అనంతపద్మనాభ స్వామి దేవాలయం అని అంటరు. ఇది ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి. ఇది హైదరాబాద్‌కి 75 కిలో మీటర్ల దూరంలో, వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండల్లో వెలసింది.

స్కంద పురాణం ప్రకారం ఈ దేవాలయం ద్వాపర యుగంలో "మార్కండేయ" ఋషి నిర్మించాడని ప్రతీతి. ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరనానికి ఆకర్షితుడైన మార్కండేయ ముని అనంతగిరి కొండలలో యోగ సాధన చేయుటకు సంకల్పిస్తాడు. ప్రతి రోజూ మార్కండేయ ముని తన యోగ సాధనతో అనంతగిరి నుండి కాశీ వెళ్ళి గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేవాడు. 

ఒక రోజు ఉదయం ప్రాతః కాలంలో ద్వాదశి ప్రవేశించుట వలన ఆయన కాశీకి వెళ్లలేకపోతాడు. శివుడు ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి ఆయనకు గంగా జలాన్ని స్నానమాచరించుటకు ఏర్పాట్లు చేస్తాడు.

ఈ ఆలయం ఉదయం 6:00 నుంచి సాయంత్రం 07:00 వరకు తెరిచి ఉంటుంది. మహబూబ్నగర్ , వనపర్తి , హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. వర్ష కాలం మరియు చలి కాలం ఈ ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కొండలే ప్రత్యేక ఆకర్షణ. సినిమా షూటింగ్ లు కూడా అధికంగా జరుగుతాయి. 


#Hindu temples guide #trip #budget travel 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana