Sri Mahishasura Mardhini devi | Hindu temples guide

 


శారదా నవరాత్రులలో నేడు 9 వ రోజు

ఈ రోజు అమ్మవారి అలంకారం : శ్రీ మహిషాసుర మర్ధని దేవి

ఆశ్వయుజ శుద్ధ నవమి.

శ్రీ మహిషాసుర మర్దనీ దేవి శ్లోకం : 

అయిగిరినందిని నందితమోదిని, విశ్వవినోదిని నందినుతే 

గిరివర వింధ్య శిరోధిని వాసిని, విష్ణువిలాసిని జిష్ణునుతే | 

భగవతి హే శితికంఠ కుటుంటిని, భూరికుటుంబిని భూరికృతే 

జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ॥

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహిషాసుర మర్దనీ దేవి గా దర్శనమిస్తారు. 

అష్టభూజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురిడిని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవులు కష్టాలను తొలగించింది. 

మహిషాసురమర్దనీ దేవి అలంకారములో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడం వలన అరిష్టాలు నశిస్తాయి. సాత్వికభావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య స్థైర్య, విజయాలు చేకూరుతాయి..!

లలితా సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. సువాసినీ పూజ చేయాలి. అవకాశం ఉంటే శ్రీ చక్రార్చన చేస్తే మంచిది.

నైవేద్యం - పులీహోర. 


#Hindu temples guide #Dasara #Vijayawada 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

KALIKA Matha Temple | Miyapur | Hyderabad | Hindu Temples Guide