Posts

Sri Laxmi Narasimha swamy temple | Moosapet | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 250 సం || కంటే పూర్వమే నుంచి ఉన్నది అని చరిత్ర. ఈ ఆలయాన్ని పూర్వం ఒక భక్తుడు స్వామి వారి కోసం తీవ్రమైన తప్పసు చేయగా స్వామి ఆ వ్యక్తికి కలలో నేను ఇక్కడే ఉన్నాను అని అనగా ఉదయమే వెళ్ళి చూడగా ఒక కొండలో మధ్యలో స్వామి వారిని చూస్తాడు.  ఈ ఆలయం అంచలు అంచలు గా అభివృద్ది చెందుతూ వచ్చింది. ఇక్కడ స్వామి వారితో పాటు శ్రీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించు కోవచ్చు. ఇక్కడ స్వామీ వారి వాహనం ఐన శ్రీ గరుత్మంతుడు స్వామి వారి ధ్వజ స్తంభం మీద దర్శించు కోవచ్చు. మరియు ఈ ఆలయంలో నవగ్రహ మండపం కూడా ఉన్నది.  ఆలయం దర్శన సమయం : ఉదయం : 06:30 నుంచి 11:30 వరకు  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:15 వరకు  #Sri Laxmi Narasimha swamy temple  #Moosapet #Hyderabad Temples #Hindu Temples Guide

Satya Datta Sadhanalaya | Yadarpalli | Keesara | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం పేరు శ్రీ సత్య దత్త సాధనాలయా. ఈ ఆలయం సికింద్రాబాద్ హైదరాబాద్ కి మధ్యలో గల కీసర మండలం , యాదర్పల్లి గ్రామంలో కలదు. ఈ ఆలయం ఫోటో 2019 లో ప్రారంబించిన అప్పటి ఫోటో. ఈ ఆలయం సరిగ్గా 5 సం || క్రితం అనగా సెప్టెంబర్ 3,4 తేదీ లలో ప్రారంభించారు. ఈ ప్రాంతంలో కి అడుగు పెట్టగానే అస్సలు వస్తు ఉండడం తోనే ఏదో మనసుకి తెలియని ప్రశాంతత , అడవిలో కి వచ్చిన అనుభూతి కలుగుతుంది. వివాహం ఆలస్యం కావడం , ఉద్యోగం దొరుకాక పోవడం , ఏ పని జరగాలి అని ప్రారంభించిన ఆది లోనే ఆటంకాలు రావడం , గురు గ్రహం బలం తక్కువగా ఉన్న వారు దక్షిణ మూర్తి స్వామిని (లేదా) దత్తాత్రేయ స్వామి (లేదా) రాఘవేంద్ర స్వామి (లేదా) లలితా దేవిని పూజ చేయాలి. వీరు అందరూ గురు స్వరూపంతో ఉండే దేవత మూర్తులు. దత్తాత్రేయ స్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ భగవత్ గీత మరియు భాగవతం పారాయణ కూడా చేస్తారు.  ఇక్కడ అమ్మవారు , కృష్ణా , శ్రీ దత్తాత్రేయ స్వామి కనిపిస్తారు. అన్నీ అలయాలో మాదిరిగా కాకుండా అస్సలు దత్తత్రేయ స్వామిని ఇక్కడ దర్శించవచ్చు. అనగ ఇక్కడ స్వామి తెల్లరాత్రి రూపంలో బ్రహ్మ , విష్ణు , మహేశ్వర  రూపంతో ఏకశిలా రూపంతో దర్శించుకోవచ్చు....

Chiryala Sri Laxmi Narsimha Swami Temple | Cheeryala | Keesara | Secunderabad | Hindu Temples guide

Image
 ఈ ఆలయం హైదరాబాద్ సికింద్రాబాద్ కి మధ్యలో గల కీసర అనే గ్రామం వద్ద గల చిర్యాల అనే గ్రామంలో కలదు. ఈ ఆలయం ప్రపంచంలోనే ఆది పొడవాడైన ప్రవేశ ద్వారం కలిగిన ఆలయం. ఈ ఆలయం ప్రవేశ ద్వారం నుంచి ఈ ఆలయం 4.5 కి. మీ దూరంలో కలదు.  ఈ ఆలయం పూర్వం లక్ష్మయ్య అనే వ్యక్తి నరసింహ కి పెద్ద భక్తుడు. అతనికి స్వామి కలలో కనిపించి నా దర్శనానికి రా అని పిలువగా తాను యాదగిరి గుట్ట లో స్వామి దర్శనం చేసుకున్న తరువాత తాను కూడా స్వామి వారికి ఆలయం నిర్మించాలి సంకల్పించి ఈ ఆలయం నిర్మించాడు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 05:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 07:30 వరకు #Chiryala Sri Laxmi Narsimha Swami Temple #Cheeryala #Keesara #Secunderabad #Hyderabad Temples #Hindu Temples guide 

Chaya Someshwara Temple | Nalgonda | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం తెలంగాణ లోని నల్గొండ జిల్లా కి కేవలం 4 కి.మీ దూరంలోనే ఉన్నది. ఈ ఆలయం గురించి తెలుసుకోవడం అంటే ఒక మిష్టరీ .  ఈ ఆలయం 10వ శతాబ్దం కి చెందిన ఆలయం. ఈ ఆలయాన్ని కందురు చోడుడు నిర్మించారు అని ఇక్కడ లభించిన శాసనం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఆలయం ఎదురుగా ఎటువంటి కట్టే కానీ ఏమి ఉండదూ కానీ శివాలయం మీద మాత్రం నీడ పడుతూ ఉంటుంది. ఇప్పటికి ఈ వింత మనం గమనించవచ్చు. పైన ఫోటోలో  చూడవచ్చు ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 07:30 వరకు  #Chaya Someshwara Temple #Nalgonda #Hyderabad Temples # Hindu Temples Guide 

Sri Sai Baba Temple | Gudimalkapur | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం. బయటి నుంచి చూస్తే మీకు నూతనంగా కనిపిస్తుంది కానీ చాలా పురాతన ఆలయం. ఈ మధ్యే పునఃనిర్మాణం చేశారు. ఈ ఆలయం సుమారు రెండు ఎకరాలలో ఉంటుంది. కానీ కొని ఆక్రమణలకి గురి అయి కొంత స్థలం మాత్రమే మిగిలి ఉన్నది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి సాయి బాబాగా కొలువై ఉన్న ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో సాయి బాబా తో పాటు గా శ్రీ త్రయంబకేశ్వరుడు , దుర్గా దేవి ఆలయం, దత్తాత్రేయ ఆలయం లు కూడా ఉన్నాయి. ఈ ఆలయం దసరా, దీపావళి, శివరాత్రి, దత్తాత్రేయ జయంతి, ఇతర పండుగ రోజులలో రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ లోని మెహింది పట్నం బస్ డిపో వద్ద కి చేరుకొని అక్కడి నుంచి ఆటోలో లేదా నడుచుకుంటూ కూడా ఈ ఆలయం చేరుకోవచ్చు. ఈ బస్ డిపో నుంచే కెవడం 1 కి. మీ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 05:00 నుంచి 11:30  మధ్యాన్నం :  12;00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Sai Baba Temple #Gudimalkapur #Hyderabad Temples #Hindu Temples Guide

Sri Sai Baba Temple | Mehindipatnam | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం సుమారు 15 సం || కంటే ముందే ఈ ఆలయం కలదు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సాయి బాబా తో పాటు ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి.  ఈ ఆలయం రెండు అంతస్థులో ఉంటుంది. కింద దేవాలయం యొక్క హాల్ కలదు. మైన ప్రధాన దేవతల ఆలయాలు కాలవు. ఈ ఆలయం లో మొదట శ్రీ గణపతి ఆలయం తారువత లక్ష్మీ దేవి యొక్క ఆలయం , శివయ్య తండ్రి ఆలయం కలవు. గురు పూర్ణిమ రోజు , శివరాత్రి రోజు , దసరా పండుగ రోజు దీపావళి రోజు అధిక రద్దీ కలదు.  ఈ ఆలయంకి చేరుకోవాలి అంటే మొదట హైదరాబాద్ లో గల మెహిందిపట్నం వద్ద కి చేరుకొని 300 లేదా 92 నెంబర్ గల బస్ ఎక్కితే పిల్లర్ నంబర్ 54 వద్ద ఎదురుగా ఈ దేవాలయం కలదు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 05:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Sai Baba Temple #Mehindipatnam #Hyderabad Temples  #Hindu Temples Guide 

Sri Pochamma Thalli Temple | Babulreddy Nagar | Kattedan | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. మొదట ఈ దేవాలయం చాలా చిన్నగా ఉంటుండే. కానీ అమ్మవారి దయతో ఆమెకి మొక్కిన మొక్కులు నిజాం కావడంతో ఇక్కడ భక్తుల రద్దీ రోజు రోజుకి అధికంగా అవుతుంది. ఈ ఆలయానికి కార్ పార్కింగ్ సౌకర్యం లేదు కానీ ఆలయం లోపల చాలా పెద్దగా ఉంటుంది.  ఈ ఆలయం లో దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి సం || బోనాల పండుగ కూడా చాల బాగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ఆరాం ఘర్ నుంచి మైలారదేవ్ పల్లి కి వెళ్ళే మార్గంలో సోలితాయిర్ స్కూల్ వెనుక ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 05:00 నుంచి 11:30  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00  నుంచి 08:00 వరకు  #Sri Pochamma Thalli Temple #Babulreddy Nagar #Kattedan #Hyderabad Temples #Hindu Temples Guide