Posts

Jiyaguda Kesari Hanuman Temple | Jiyaguda | Hindu Temples guide | Hyderabad

Image
  ఈ ఆలయంలోని స్వామి వారు శ్రీ హనుమాన్ ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని జియగూడ లో కలదు.  ఈ ఆలయం మూసి నదికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని శ్రీ రాముడు సీత కోసం అన్వేషణ జరిగే సమయంలో ఇక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు అని చరిత్ర.  ప్రతి సం || శ్రీ ఆంజనేయ స్వామి  వారి మాల ధార భక్తులు అధికంగా ఇక్కడికి వస్తారు. మరియు ఇక్కడ ప్రతి సం || శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి పెద్ద ఎత్తున జరుగుతుంది.  ఆలయ సమీపంలోనే ఒక గోశాల కలదు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 11:30  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:30 వరకు  #Jiyaguda Kesari Hanuman Temple #Jiyaguda #Hyderabad temples #Hindu Temples guide |#Hyderabad

Swayambhu Chennakesava Swamy Temple | Chandrayangutta | Hindu temples guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం 600 సం || క్రితమే నిర్మించారు. ఇంతటి పురాతన ఆలయం ఇప్పుడు శిధిలావస్థ కి చేరుకున్నది. హైదరాబాద్ లోని కేశవగిరి అనే ప్రాంతం వద్ద ఉన్నది ఈ ఆలయం. ప్రస్తుతం ఈ ప్రాంతం ముస్లిం ఆక్రమణ ప్రాంతంలో కలదు. ఈ దేవలయాన్నికి 2 వీలర్ పోవడమే చాలా  కష్టంతో కూడుకున్న పని.  ఈ ఆలయంలో స్వామి వారు ఒక్క గుట్టలో వెలిశారు. అనగా ఈ స్వామి విగ్రహం మానవ నిర్మితం కాదు. స్వామి విగ్రహం స్వయంభూ విగ్రహం. ఇక్కడ స్వామి వారు లక్ష్మీ దేవితో ఉంటారు. ఈ ఆలయం చోళరాజుల కాలం నుంచి నిజాం కాలం వరకు బాగానే ఉండేది. కానీ తరువాత శిధిలా వస్థకి చేరుకున్నది.  ఇక్కడ స్వామివారికి ప్రతి సం || వార్షికోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయం ఒక గుట్ట మీద ఉండడం వల్ల పైకి వెళ్ళిన తరువాత వ్యూ పాయింట్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 07:30 వరకు  #Swayambhu Chennakesava Swamy Temple #Hyderabad temples #Chandrayangutta #Hindu temples guide 

Sri Shanidev Temple | TS Secretariat | Hindu temples guide

Image
  ఈ ఆలయం హైదరాబాద్ లోని నడిబొడున్న ఈ ఆలయం ఉన్నది అని చాలా మందికి తెలియదు. ఈ ఆలయం పూర్తిగా శిరిడీ దగ్గరలో గల శ్రీ శని శింగణపూర్ అనే ఆలయం వలె ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ఈ ఆలయం చాలా శక్తి వంతమైన ఆలయం.  చాలా మంది శిరిడీ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ శని శింగణపూర్ కి వెళ్ళి శని దేవునికి తైలం తో అభిషేకం చేపించుకుంటారు. కానీ అలాంటి ఆలయం మన హైదరాబాద్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సెక్రటేరియట్  వెనుక ఈ ఆలయం ఉన్నది అని చాలా మందికి తెలియదు. ఈ ప్రాంతం పేరు మీట్ కౌంపౌండ్ అని అంటారు.  ప్రతి శనివారం ఇక్కడ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయం తో పాటు ప్రక్కనే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా కలదు. స్వామి వారిని దర్శించుకొని వెళ్ళితే ఎటువంటి ధర్మ బద్దమైన కోరిక నైనా నెరవేరస్తారు అని భక్తుల నమ్మకం.  అమావాస్య రోజు మరియు శనివారంతో కూడిన త్రయోదశి రోజు విశేష పూజలు నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యానం : 12:00 నుంచి 03:30 బ్రేక్  సాయంత్రం : 03:30 నుంచి 08:00 వరకు  #Sri Shanidev Temple #TS Secretariat #Hyderabad temples #Hindu temples guide 

Falaknama Kali temple | Falaknama | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఫలక్ నామ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది.  ఇక్కడ అమ్మవారు ఏకా శిలా విగ్రహం. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మావారు. పూర్వం ఇక్కడ ఒక శ్మశాన వాటిక ఉండేది. ఇప్పుడు పూర్తిగా రైల్వే స్టేషన్ ఆధీనంలో ఉంటుంది.  ఇక్కడ పూర్వం అమ్మవారు నడిచి వెల్లుతుంటే గజేల చప్పుడు వస్తుండే అని ప్రతీతి. చాలా భయంకరంగా ఉంటుండే ఈ ప్రాంతం.  అందుకే మొదట ఈ ఆలయం దగ్గరికి వెళ్ళడానికి కూడ చాలా భయపడే వారు.  ఇప్పుడు ఈ అమ్మవారి ఆలయం కొద్దిగా అభివృద్ది చెందడం వల్ల రద్దీ ఉండడం వల్ల అందరూ చాలా బాగా దర్శించుకుంటూన్నారు. ఇక్కడ ప్రతి ఆదివారం , మంగళ వారం , శుక్రవారం రద్దీ అధికంగా ఉంటుంది. బోనాల పండుగా , దసరా పండుగ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00 వరకు  మధ్యాన్నం : 12:00 నుంచి 03:30 వరకు బ్రేక్  సాయంత్రం : 03:30 నుంచి 08:00 వరకు  #Falaknama Kali temple #Falaknama #Hyderabad temples #Hindu Temples Guide 

Sri Anantha Padbnabha Swami | Kothuru | Hindu temples guide

Image
  శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం పెంజర్ల గ్రామం కొత్తూర్ మండలం వద్ద కలదు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు 40 కి.మీ దూరంలో కలదు. ఈ ఆలయం చాలా ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఈ ఆలయంలో లో స్వామి వారు శ్రీ రంగంలో ఉన్నటు ఉంటుంది.  స్వామి వారు స్వయంభూ స్వామి. పూర్వం ఒక భక్తుడికి కలలో కనిపించి తాను ఇక్కడ ఉన్నాను బయటికి తీసి ఆలయం నిర్మించామని చెప్పారు. స్వామి కోరిక మేరకు ఇక్కడ ఆలయం కట్టించారు. స్వామి పేరు లోనే ఉన్నది. అనంత పద్మనాభ స్వామి అంటే తన భక్తులకి ఏది కోరుకున్న అనంత మైన ఆనందం ప్రసాదించే స్వామి కాబట్టి ఈ పేరు తో ఇక్కడ వెలిశారు.  ఈ ఆలయం లో శ్రీ దేవి అమ్మవారు , భూదేవి అమ్మవారు ,శ్రీ అనంత పద్మనాభ స్వామి , శ్రీ ఆంజనేయ స్వామి ఇతర ఆలయాలు కలవు.  ప్రస్తుతం ఈ ఆలయం ఇంకా ఎక్కువ అబివృద్ది కి చేరుకోలేదు. మనం అందరం కలిసి ఈ ఆలయాన్ని రక్షించుకొని అభివృద్ది చేయవలసిన భాద్యత మన అందరి మీద కలదు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 11:30 వరకు  మధ్యాన్నం : 11 : 30 నుంచి 03:30 వరకు బ్రేక్  సాయంత్రం : 03:30 నుంచి 07:00 వరకు  #Sri Anantha Padbnabha Swami #Hyderabad temples...

Sri Sri Sri Shiridi Sai baba temple | Dilsukhnagar | Hindu temples guide

Image
  ఈ ఆలయం చాలా పురతన ఆలయం. ఈ ఆలయం సుమారు 45 సం || పూర్వమే నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని దిల్ సుఖనగర్ లో కలదు. చాలా ప్రాచుర్యం పొందిన ఆలయం. ప్రతి గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా శిరిడీ సాయి బాబా ఆలయం లాగా నిర్మించడం విశేషం.  ఈ దేవాలయంలో 1980లో నిర్మించబడింది. భక్తులు ఈ దేవాలయాన్ని దక్షిణ షిరిడీగా పిలుస్తుంటారు. శిరిడీ వెళ్లలేని వారు ఈ ఆలయం దర్శిస్తే సరిపోతుంది. ప్రతి సం || గురు పూర్ణిమ , శ్రీ రామ నవమి చాలా బాగా జరుగుతుంది. ఈ చాలా సార్లు దాడులకి తట్టుకొని నిలబడినది.  ఆలయ ట్రస్ట్ ఏర్పడి  వారి ఆధ్వర్యంలో 1989లో దేవాలయంలోని సాయిబాబా పాలరాతి విగ్రహాం ప్రతిష్ఠించబడింది. అంతకు ముందున్న పాత విగ్రహాన్ని ఆలయం ఎడమవైపు దర్శనార్థం ఉంచారు. ప్రతి రోజు శేజ్ , కాకడ హారతి చాలా బాగా నిర్వహిస్తారు.  1990ల నుండి బాగా ప్రాచూర్యం పొందింది. ముఖ్యంగా గురువారం నాడు అనేకమంది భక్తులు వస్తారు. 1991లో మొదటి అంతస్తు నిర్మించి ధ్యాన మందిరం, 1993లో దేవాలయ ప్రధాన మందిరం నిర్మించగా, 1994లో సాయిబాబాకి స్వర్ణ కిరీటం అలంకరించారు.  1996లో దేవాలయం రెండో అంతస్తు నిర్మించబ...

Sri Sringeri Sharadha Chandramouleeshwara swamy temple | Dilsukhnagar | Hindu temples guide

Image
  ఈ ఆలయం దిల్ సుఖనగర్ లో ఉన్న ప్రధాన ఆలయాలలో ఒకటి. ఈ దేవాలయం హైదరాబాద్ లోని దిల్ సుఖనగర్ పోలీస్ స్టేషన్ పక్కనే కలదు.  ఈ ఆలయం ప్రధాన రోడ్డు మీదనే ఉంటుంది. ఈ ఆలయం పురాతన ఆలయం. ఈ ఆలయం శ్రీ శృంగేరి పీఠం వారిచే నడపబడుతుంది.  ఈ ఆలయంలో ప్రధానంగా శివయ్య తో పాటుగా , గణపతి , దుర్గమ్మ , శ్రీ ఆంజనేయ స్వామి , నవగ్రహ మండపం , శ్రీ కాలభైరవ స్వామి , శ్రీ అయ్యప్ప స్వామి కలరు.  శివరాత్రి రోజు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి , దసరా కూడా చాలా బాగా నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Sringeri Sharadha Chandramouleeshwara swamy temple #Dilsukhnagar #Hyderabad temples #Hindu temples guide