Sri Shanidev Temple | TS Secretariat | Hindu temples guide
ఈ ఆలయం హైదరాబాద్ లోని నడిబొడున్న ఈ ఆలయం ఉన్నది అని చాలా మందికి తెలియదు. ఈ ఆలయం పూర్తిగా శిరిడీ దగ్గరలో గల శ్రీ శని శింగణపూర్ అనే ఆలయం వలె ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ఈ ఆలయం చాలా శక్తి వంతమైన ఆలయం.
చాలా మంది శిరిడీ కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ శని శింగణపూర్ కి వెళ్ళి శని దేవునికి తైలం తో అభిషేకం చేపించుకుంటారు. కానీ అలాంటి ఆలయం మన హైదరాబాద్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సెక్రటేరియట్ వెనుక ఈ ఆలయం ఉన్నది అని చాలా మందికి తెలియదు. ఈ ప్రాంతం పేరు మీట్ కౌంపౌండ్ అని అంటారు.
ప్రతి శనివారం ఇక్కడ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయం తో పాటు ప్రక్కనే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా కలదు. స్వామి వారిని దర్శించుకొని వెళ్ళితే ఎటువంటి ధర్మ బద్దమైన కోరిక నైనా నెరవేరస్తారు అని భక్తుల నమ్మకం.
అమావాస్య రోజు మరియు శనివారంతో కూడిన త్రయోదశి రోజు విశేష పూజలు నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యానం : 12:00 నుంచి 03:30 బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 08:00 వరకు
#Sri Shanidev Temple #TS Secretariat #Hyderabad temples #Hindu temples guide

Comments
Post a Comment