Sri Sri Sri Shiridi Sai baba temple | Dilsukhnagar | Hindu temples guide
ఈ ఆలయం చాలా పురతన ఆలయం. ఈ ఆలయం సుమారు 45 సం || పూర్వమే నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని దిల్ సుఖనగర్ లో కలదు. చాలా ప్రాచుర్యం పొందిన ఆలయం. ప్రతి గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా శిరిడీ సాయి బాబా ఆలయం లాగా నిర్మించడం విశేషం.
ఈ దేవాలయంలో 1980లో నిర్మించబడింది. భక్తులు ఈ దేవాలయాన్ని దక్షిణ షిరిడీగా పిలుస్తుంటారు. శిరిడీ వెళ్లలేని వారు ఈ ఆలయం దర్శిస్తే సరిపోతుంది. ప్రతి సం || గురు పూర్ణిమ , శ్రీ రామ నవమి చాలా బాగా జరుగుతుంది. ఈ చాలా సార్లు దాడులకి తట్టుకొని నిలబడినది.
ఆలయ ట్రస్ట్ ఏర్పడి వారి ఆధ్వర్యంలో 1989లో దేవాలయంలోని సాయిబాబా పాలరాతి విగ్రహాం ప్రతిష్ఠించబడింది. అంతకు ముందున్న పాత విగ్రహాన్ని ఆలయం ఎడమవైపు దర్శనార్థం ఉంచారు. ప్రతి రోజు శేజ్ , కాకడ హారతి చాలా బాగా నిర్వహిస్తారు.
1990ల నుండి బాగా ప్రాచూర్యం పొందింది. ముఖ్యంగా గురువారం నాడు అనేకమంది భక్తులు వస్తారు. 1991లో మొదటి అంతస్తు నిర్మించి ధ్యాన మందిరం, 1993లో దేవాలయ ప్రధాన మందిరం నిర్మించగా, 1994లో సాయిబాబాకి స్వర్ణ కిరీటం అలంకరించారు.
1996లో దేవాలయం రెండో అంతస్తు నిర్మించబడింది. ప్రతి గురువారం అన్నప్రసాదం చేస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 01:00 వరకు
మధ్యాన్నం : 01:00 నుంచి 03:30 వరకు బ్రేక్
సాయంత్రం :04:00 నుంచి 09:00 వరకు
#Sai baba temple #Dilsukhnagar #Hindu temples guide

Comments
Post a Comment