Swayambhu Chennakesava Swamy Temple | Chandrayangutta | Hindu temples guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం 600 సం || క్రితమే నిర్మించారు. ఇంతటి పురాతన ఆలయం ఇప్పుడు శిధిలావస్థ కి చేరుకున్నది. హైదరాబాద్ లోని కేశవగిరి అనే ప్రాంతం వద్ద ఉన్నది ఈ ఆలయం. ప్రస్తుతం ఈ ప్రాంతం ముస్లిం ఆక్రమణ ప్రాంతంలో కలదు. ఈ దేవలయాన్నికి 2 వీలర్ పోవడమే చాలా  కష్టంతో కూడుకున్న పని. 

ఈ ఆలయంలో స్వామి వారు ఒక్క గుట్టలో వెలిశారు. అనగా ఈ స్వామి విగ్రహం మానవ నిర్మితం కాదు. స్వామి విగ్రహం స్వయంభూ విగ్రహం. ఇక్కడ స్వామి వారు లక్ష్మీ దేవితో ఉంటారు. ఈ ఆలయం చోళరాజుల కాలం నుంచి నిజాం కాలం వరకు బాగానే ఉండేది. కానీ తరువాత శిధిలా వస్థకి చేరుకున్నది. 

ఇక్కడ స్వామివారికి ప్రతి సం || వార్షికోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయం ఒక గుట్ట మీద ఉండడం వల్ల పైకి వెళ్ళిన తరువాత వ్యూ పాయింట్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. 


ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30 
మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 
సాయంత్రం : 04:00 నుంచి 07:30 వరకు 

#Swayambhu Chennakesava Swamy Temple #Hyderabad temples #Chandrayangutta #Hindu temples guide 

Comments