Falaknama Kali temple | Falaknama | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఫలక్ నామ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఏకా శిలా విగ్రహం. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మావారు. పూర్వం ఇక్కడ ఒక శ్మశాన వాటిక ఉండేది. ఇప్పుడు పూర్తిగా రైల్వే స్టేషన్ ఆధీనంలో ఉంటుంది.
ఇక్కడ పూర్వం అమ్మవారు నడిచి వెల్లుతుంటే గజేల చప్పుడు వస్తుండే అని ప్రతీతి. చాలా భయంకరంగా ఉంటుండే ఈ ప్రాంతం. అందుకే మొదట ఈ ఆలయం దగ్గరికి వెళ్ళడానికి కూడ చాలా భయపడే వారు.
ఇప్పుడు ఈ అమ్మవారి ఆలయం కొద్దిగా అభివృద్ది చెందడం వల్ల రద్దీ ఉండడం వల్ల అందరూ చాలా బాగా దర్శించుకుంటూన్నారు. ఇక్కడ ప్రతి ఆదివారం , మంగళ వారం , శుక్రవారం రద్దీ అధికంగా ఉంటుంది. బోనాల పండుగా , దసరా పండుగ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00 వరకు
మధ్యాన్నం : 12:00 నుంచి 03:30 వరకు బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 08:00 వరకు
#Falaknama Kali temple #Falaknama #Hyderabad temples #Hindu Temples Guide

Comments
Post a Comment