Sri Mata Pochamma Devalayam | Manikyamma nagar | Rajendhra Nagar | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన దేవాలయం. ఈ ఆలయం చాలా చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన దేవాలయం. ఈ ఆలయాన్ని ఇక్కడి భక్తులు సుమారు 25 సం || కంటే ముందు నుంచే కాపాడుతూ ఉన్నారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంధ్ర నగర్ వద్ద గల మాణిక్యమ్మ నగర్ మరియు అంబేడ్కర్ నగర్ కి మధ్యలో ఉంటుంది. కోఠి నుంచి మరియు మెహింది పట్నం నుంచి ఈ ఆలయానికి బస్ లు కలవు. ఈ ఆలయం పూర్తిగా ఇళ్ల మధ్యలో ఉండడం వల్ల ఆలయం కనుకోడం కొంచం కష్టంగా ఉంటుంది. కానీ రాజేంధ్ర నగర్ కి వచ్చి ఏన్ ఐ ఆర్ డి వచ్చిన తరువాత ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి సం || ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాల పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి బోనాలు సమర్పించి సాయంత్రం రంగం నిర్వహిస్తారు. ఇందులో ఘటల ఉరేరిగింపు , డప్పు చప్పులు , పోతరాజుల నృత్యాలు , యువతి , యువకుల ఆటలు చాలా ఘనంగా జరుగుతాయి. బోనాల పండుగ తో పాటుగా ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి దసరా పండుగ కూడా చాలా వైభవముగా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారికి దేవి నవరాత్రులు 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ అలంకరణలు నిర్వహించి ఆన్నదాన ప్రసాద వితరణ నివహ...