Sri Murali Manohar Temple | Kishan bagh | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 300 సం || చరిత్ర కలిగి ఉన్నది. ఈ ఆలయం పేరు శ్రీ మురళీ మనోహర్ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయం లో ప్రధాన దేవత మూర్తి శ్రీ కృష్ణుడు.
ఈ ఆలయం పూర్తిగా ఉత్తర భారత దేశంలో ఉండే శ్రీ కృష్ణుడి ఆలయాల విధంగా ఉంటుంది. ఆ ఆలయంలో చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయం లో చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ద్విచక్ర వాహనాలు కూడా చాలా వరకు లోపలానే పార్కింగ్ చేసుకోవచ్చు. మొదట గణపతి ఆలయం , మరియు హోమ గుండం కూడా ఉన్నది. పక్కనే బాల హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. ఈ ఆలయాన్ని తప్పకుండ చూడాలి. మరి కొంచం పక్కకి వెళ్ళగానే అక్కడే శివాలయం కూడా ఉంటుంది. ఈ శివలింగం తప్పకుండ చూడాలి. హనుమాన్ ఆలయం మరియు శివాలయం కోనేరు పక్కనే ఉంటాయి. ఆ కోనేరు కి ఈ ఆలయం కింద నుంచే వెళ్ళే మార్గం ఉన్నది. గుండం కూడా చాలా లోతుగా ఉంటుంది.
ఇప్పుడు ప్రధాన ఆలయం విశ్యంలోకి వస్తే ఈ ఆలయంలోని శ్రీ కృష్ణుడు రాజ బహదూర్ అనే వ్యక్తికి కలలో కనిపించి తను ఇక్కడే ఉన్నాను అని మరియు తనకి ఇక్కడే ఆలయం కట్టించమని చెప్పగా ఆ వ్యక్తి దిల్లి నుంచి వచ్చి స్వామి చెప్పిన ప్రాంతం లో చూడగానే మొత్తం రాళ్ళు రప్పలతో ముల్ల అడవి లాగా ఉన్నది. తరువాత అతను ఈ ప్రాంతాన్ని అంతా చదును చేస్తూ ఉండగా శ్రీ కృష్ణా స్వామి విగ్రహం కనిపించినది. స్వామి లభించిన ప్రాంతంలోనే ప్రతిష్ట చేశారు. స్వామి విగ్రహాన్ని ఒక్కసారి చూడగానే ఇట్టే ఆకట్టుకుంటుంది. కార్తీక మాసం లో నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ దేవాలయం ప్రభుత్వ అధీనంలో ఉన్నది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:30 వరకు
#Lord Krishna #Murali #kishanbagh #Attapur #Hyderabad #hyderabad Temples #shiva #hanuman

Comments
Post a Comment