Sri Sri Sri Panduranga Shiva Anjaneya swamy Temple | Premavathi pet | Rajendhra Nagar | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో శివ కేశవులని ఇద్దరినీ ఏక కాలంలో దర్శించుకోవచ్చు. ఈ ఆలయనికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కానీ లోపల ఆలయం మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది. 

 ప్రతి నెల మాస శివరాత్రి రోజున మరియు మహాశివరాత్రి రోజున విశేష పూజలు మరియు అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మనకి అరుదుగా కనిపించే శ్రీ పాండురంగా స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం హైదరబాద్ లోని రాజేంధ్ర నగర్ వద్ద గల ప్రేమావతి పేట ఏజి‌ కాలేజీ ఆడిటోరియుం కి చాలా దగ్గర ఉంటుంది. ఈ ఆలయం ఈ కాలేజీ కి సమీపంలో ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణం లో ఉన్నట్టు ఉంటుంది. ఈ ఆలయంలో ఇతర చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో మరియొక్క ప్రధాన ఆలయం కూడా ఉన్నది. అదే మన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి శనివారం రోజున స్వామికి విశేష అర్చన మరియు అలంకరణ  జరుగుతుంది. సాయంత్ర సమయంలో ఈ ఆలయ దర్శనం మరియు ఈ కాలేజీ వాతావరణం మనస్సుకు చాలా ప్రశాంతతని కలిగిస్తాయి. 

ఆలయ సందర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:00

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్

సాయంత్రం : 05:00 నుంచి 08:30 వరకు 

Sri Sri Sri Panduranga Shiva Anjaneya swamy Temple #Premavathi pet  #Rajendhra Nagar  #Hyderabad #lordHanuman #lordShiva #Lord 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana