Sri Krishna Devasthanam | Budwel | Rajendhranagar | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 25 సం || కంటే పురాతనమైనది. ఏ విధమైన సహాయ సహకారాలు లేక ఈ ఆలయం ఇప్పుడు శిధిలా వస్తాకి చేరుకున్నది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం కానీ ఇప్పుడు చుటూ పక్కల ఉన్న భక్తుల వల్ల అభివృద్ది జరుగుతుంది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంధ్ర నగర్ వద్ద గల బుద్వేల్ కి అతి సమీపంలో ఉన్న కిష్మత్ పూర్ అనే గ్రామానికి ప్రారంభం లోనే ఈ ఆలయం కలదు. చాలా మంది ఈ ఆలయం ముందు ఉన్న రోడ్ మీద నుంచి వెల్లుతున్న కూడా సరిగ్గా గమనించలేరు.
ఈ ఆలయంలో శ్రీ కృష్ణా అష్టమి రోజున విపరీతమైన రద్దీ ఉంటుంది. ఆ రోజున అందరికీ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శ్రీ కృష్ణా స్వామి ఆలయం మాత్రమే కాకుండా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం శివాలయం కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆలయం ఎదురుగా ఉన్న కాలి ప్రాంతంలో రేకుల శేడ్డు నిర్మించారు. అందులో ప్రతి శనివారం మరియు ఆదివారం కొద్ది మంది భక్తులు భజన కార్యకమలు నిర్వహిస్తారు.
ప్రత్యేకముగా కృష్ణాష్టమి , మాస శివరాత్రి , హనుమాన్ జయంతి విశేష పూజలు నిర్వహిస్తారు.
ఆలయ సందర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:30
#Sri Krishna Devasthanam #Budwel #Rajendhranagar #Hyderabad

Comments
Post a Comment