Posts

Sri Ganapati Karyasiddi Hanuman Temple | RBI Colony | VijayNagar Colony | Kothapet | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతనా ఆలయం. ఈ దేవాలాయం చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన ఆలయం. ఈ దేవాలయం చిన్నగా ఉన్న కూడా ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.  ఈ ఆలయం హైదరాబాద్ లోని యల్.బి. నగర్ కి కొద్ది దూరంలో గల కొత్తపేట్ విజయ్ నగర్ కాలనీ కి మరియు ఆర్.బి.ఐ కాలనీ కి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది.  ఈ ఆలయంలో శ్రీ లక్ష్మి గణపతి స్వామి తో పాటుగా కార్యసిద్ది హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. ఇలాంటి కార్యసిద్ది హనుమాన్ పేరు తో గల ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటిని తప్పకుండ దర్శించుకోవాలి.  ఈ దేవాలయంలో మరియొక్క ప్రత్యేకత ఏమిటి అనగా శివలింగం వెనుకనే అమ్మవారి విగ్రహం ఉండడం విశేషం. మరియు ఆ శివలింగం శుద్ద స్పటిక కాశీవిశ్వేశ్వర స్వామి లింగం.    ఈ శివలింగాన్నికి పాలతో అభిషేకం చేస్తే మరింత తెల్లగా పసుపు నీటితో అభిషేకం చేస్తే పసుపురంగు గాను, కుంకుమ నీటితో అభిషేకం చేస్తే కుంకుమ రంగు శివలింగంగా కనిపిస్తుంది.  ప్రతి మాస శివరాత్రి , సోమవారం , మహా శివరాత్రి , దేవి నవరాత్రి , గణపతి నవరాత్రి , హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేక రోజులలో ఉచిత సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా...

Sri Putta Yellamma Sri Renuka Devi Alayam | Sathyanarana nagar | Gudimakapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం  కొంచం చిన్నగా ఉంటుంది. ఇలాంటి ఆలయం హైదరాబాద్ లో చాలా తక్కువగా దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతగా ఉన్నారు.  ఈ ఆలయం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ పిల్లర్ నెంబర్ 84 నుంచి సత్యానారాయణ నగర్ లో ఉంటుంది. ఈ ఆలయానికి కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. ఈ ఆలయం ఇంటీలలో మధ్యలో ఉంటుంది.  ఈ ఆలయంలో అమ్మవారు శ్రీశ్రీ శ్రీ పుట్ట ఎల్లమ్మ రేణుకా దేవి ఆలయంగా పిలుస్తారు. ఈ  ఆలయంలో అమ్మవారు ప్రధాన దేవతగా కొలువై ఉన్నారు.  ప్రతి సం|| ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారికి చాలా మంది భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో ఇక్కడ కూడా అమ్మవారికి దసరా ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.  దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రతి రోజు కుంకుమార్చన చేసి ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఉచిత ఆన్నదాన ప్రసాద వితరణ కూడా చేస్తారు. సాయంత్రం సమయంలో ఈ ఆలాయంలో రద్దీ చాలా తక్కువగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు  #Sri Putta Yellamma Sr...

Sri Sita Ramanjaneya Swamy Temple | Gouri shankar Nagar | Banjarahills 10&11 | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పేరు శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయం గా ఇక్కడి భక్తులు పిలుస్తారు. ఈ దేవాలయం కొంచం చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన ఆలయం.  ఈ ఆలయం హైదరాబాద్ లోని  బంజారాహిల్ల్స్ రోడ్ నెంబర్ 10 మరియు 11 కి మధ్యలో గౌరి శంకర్ నగర్ అనే బస్తి లో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉంది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సీతా రామాంజనేయ స్వామీ ఉంటారు. ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో గణపతి ఆలయం, శివాలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, పెద్ద రావి చెట్టు కూడా ఉన్నాయి. ఇక్కడ మరియొక్క ప్రధాన ఆకర్షణ పెద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం.  ఇక్కడ ప్రతి సం || శ్రీ ఆంజనేయ జయంతి, శ్రీ రామ నవమి , సీతా రాముల కళ్యాణం చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. సామూహిక ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మద్యన్నం : 12:00 నుంచి 04:30బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00  #Sri Sita Ramanjaneya Swamy Temple  #Gouri shankar Nagar  #Banjarahills 10&11 #Hyd...

Sri Lakshmi Ganapathi Devalayam | Castle Hills | APHB Colony | Vijaynagar Colony | Mehindipatnam | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతనా ఆలయం. ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆలయం కొంచం పెద్దగానే ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం వద్ద గల ఎన్‌ఎం‌డి‌సి(NMDC) వెనుక గల విజయ్ నగర్ కాలనీ వద్ద ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు.  ఈ ఆలయంలో ప్రధాన దేవతా మూర్తి శ్రీ లక్ష్మి గణపతి స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో చాలా ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ ఆది శంకరాచార్య స్వామి ఆలయం , శివాలయం , గణపతి నవరాత్రి ఉత్సవ విగ్రహాల మండపం కూడా ఉన్నాయి.  ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ గణపతి స్వామి యొక్క నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. 10 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించి భజనలు చేస్తారు. ఈ ప్రత్యేక రోజులలో స్వామి వారికి మొదట సుప్రభాత సేవ , అభిషేకం , అర్చనా , గరిక పూజా , హోమలు , భజనలు కూడా నిర్వహించి ఉచిత సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహించి ఉత్సవ విగ్రహాన్ని నిమార్జనము కూడా చేస్తారు.  ఈ ఆలయంలో కేవలం గణపతి నవరాత్రి ఉత్సవాలు మాత్రమే కాకుండా దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. మహా శివరాత్రి రోజున స్వామి వారికి విశ...

Sri Brahmaraamba Mallikarjuna Swamy Goshala | Raghavendra Colony | Ramachandrapuram | BiramgudaGutta | Hyderabad

Image
  ఈ గోశాల చాలా పెద్ద గోశాల. ఈ గోశాల లో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి భక్తులు ఈ గోశాల ని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి గోశాల అని పిలుస్తారు. గోశాల అంటే ఏదో కొని ఆవులు మాత్రమే ఉంటాయి అని అనుకుంటున్నారు ఏమో. ఇక్కడ అలా ఉండధు. ఈ గోశాల మొత్తం 10 ఎకరాల కంటే పెద్దగానే ఉంటుంది. ఈ గోశాల బీరంగుడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం నుంచి కేవలం 01కి.మీ దూరంలో గుట్ట కింద ఎడమవైపున ఉంటుంది. నూతనంగా నిర్మించిన govt క్వాటర్స్ వెనుకనే ఈ గోశాల ఉంటుంది.  ఈ గోశాల లో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ కృష్ణా ఆలయం , శ్రీ సీతారామ లక్ష్మణ సమెత  ఆంజనేయ స్వామి ఆలయం, నాగదేవత ఆలయం , ధ్యాన మందిరం , చిన్నగా ఉన్న బ్రహ్మసూత్ర శివలింగం , పక్కనే గణపతి , సుబ్రమణ్య స్వామి 10 గోశాల నివాస షేడ్డు లు ఉన్నాయి.  ఈ ఆలయంలో ప్రతి సోమవారం శివాలయంలో , గురువారం శ్రీ కృష్ణా స్వామి ఆలయంలో , శనివారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. శివాలయంలో స్వయంగా మన చేతులతో మనమే స్వామి కి అభిషేకం చేసుకోవచ్చు.  ఈ ఆలయంలో సుమారు 1000కి పైగా గోవూలు ఉన్నాయి. ఈ నెల 23/11/2025 న మహాస్వామి సేవ సమితి వ...

Sri Prasanna Anjaneya Swamy Temple | Devuni Kunta | Humayun Nagar | Hyderabad

Image
  ఈ‌ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన ఆలయం. ఈ ఆలయం శ్రీ హనుమాన్ భక్త సమాజం వారి ఆధ్వర్యం లో నడుస్తున్న ఆలయం.  ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం హుమాయూన్ నగర్ వద్ద గల దేవుని కుంట అనే ప్రాంతంలో ఈ దేవాలయం కలదు. ఈ ఆలయాన్ని ఇక్కడి భక్తులు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంగా పిలుస్తారు.  ఈ ఆలయం కొంచం ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ గణపతి స్వామి ఆలయం, శివాలయం,  శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ,  శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి ఆలయం, నవగ్రహ మండపం కూడా ఉన్నది.  ఈ ఆలయంలో ప్రతి సం ||  శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామికి ఉత్సవాలు జరుగుతాయి. స్వామి కి ప్రతి శనివారం తమలపాకులు తో అలంకరణ , అర్చనా చేస్తారు. అప్పుడు తప్పకుండ స్వామి ని దర్శిస్తే మనస్సు చాలా ప్రశాంతతని పొందుతుంది.  ఈ దేవాలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు గల ప్రధాన కారణం ఈ దేవాలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. హనుమాన్ జయంతి రోజున ఈ ఆలయంలో ఉచిత సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా చేస్తారు. శ్రీ సీతా రాముల కళ్యాణం రోజున కళ్యాణం నిర్వహించి ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.  మెహింద...

Sri Sri Sri Renuka Yellamma Temple | Hyderguda | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 25 సం || ముందు నుంచే ఇక్కడ ఉన్నది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ఈ అమ్మవారి ఆలయంలో అమ్మ మనకి అమ్మ జ్యోతి రూపంలో కూడా దర్శనం ఇస్తుంది.  ఈ దేవాలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ కి దగ్గర లోగల హైదర్ గూడ పిల్లర్ నెంబర్ 140 కి ఎదురుగానే ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది. సరిగ్గా హైదర్ గూడ బంటియా కి ఎదురుగా ఈ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం లో అమ్మవారి పేరు శ్రీ శ్రీ శ్రీ రేణుకా యెల్లమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడి గ్రామ దేవత గా కొలుస్తారు. ప్రతి సం || ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయం చిన్న గా ఉన్న కూడా చాలా శక్తివంతమైన ఆలయం. పోతరాజులు కూడా ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తారు.  పూర్వం ఈ ఆలయం చిన్నగా ఉన్న కూడా ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అభివృద్ది కి నోచుకుంటుంది. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 03:30 బ్రేక్ సాయంత్రం : 03:30 నుంచి 08:00  #Sri Sri Sri Renuka Yellamma Temple  #Hyde...