Sri Yenugula Maisamma Temple | Attapur | Hyderabad | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడి అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉన్న కూడా భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహింది పట్నం కి అతి చేరువలో గల అత్తాపూర్ వద్ద గల జనప్రియ కాలనీ కి మద్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయనికి కేవలం ద్విచక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నది.
ఈ ఆలయంలోని అమ్మవారు చాలా ప్రశాంతంగా చక్కటి చిరునవ్వుతో చూడగానే ఇట్టే ఆకర్శిస్తుంది. ఈ ఆలయంలో ప్రతి సం || ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున్న జరుపుతారు. ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రి గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఆలయంలో ఆ రోజులలోచండీ హోమం మరియు చండీ సప్తశతీ పారాయణ కూడా జరుపుతారు.
ఈ ఆలయం దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Yenugula Maisamma Temple #Attapur #Hyderabad #Telangana

Comments
Post a Comment