Sri Shivaramakrishna Devalayam | Bharath Nagar | Kishmatpur | Hyderabad
ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు. అది కూడా శిధిలావస్థకి చేరుకున్నది. ఇక్కడి భక్తులు అందరూ కలిసికట్టుగా ఈ దేవాలయాన్ని పునః నిర్మించి కొత్త అలయంగా మార్పు చేశారు.
ఈ ఆలయం హైదరబాద్ లోని కిస్మత్ పూర్ వద్ద గల భారత్ నగర్ కి దగ్గలోనే ఈ ఆలయం. మరియు ఈ దేవాలయం రాజేంధ్ర నగర్ ఆచార్య ఎన్.జి.రంగా యునివర్సిటి కి చాలా దగ్గరలోనే ఈ ఆలయం ఉన్నది. ఈ యునివర్సిటి నుంచి ఈ ఆలయంకి కేవలం 03 కి.మీ దూరంలోనే ఉన్నది.
ఈ ఆలయం చాలా ప్రత్యేకతలతో కూడా ఉన్నది. ఆ కాలంలోనే అని దేవతల విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ట చేశారు. ఈ ఆలయంలో చాలా ఉప ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా శ్రీ గణపతి దేవాలయం , శివాలయం , శ్రీ రామాలయం , శ్రీ కృష్ణా ఆలయం , చిన్న నవగ్రహ మండపం కూడా ఉన్నది. ఈ ఆలయానికి చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం కలదు. ద్వి చక్ర , త్రీచక్ర వాహనాలు, బస్ లు , కంటైనర్ వరకు నిలిపే అంతా పెద్ద స్థలం ఈ ఆలయానికి కలదు.
ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో శివరాత్రి , వైకుంఠ ఏకాదశి , శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ జయంతి చాలా వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేక రోజులలో అన్నదాన ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి రాత్రి 08:00 వరకు
#Sri Shivaramakrishna Devalayam #Bharath Nagar #Kishmatpur #Hyderabad

Comments
Post a Comment