Sri Shivalayam Temple | Bandlaguda Jagir | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు. ఆలయం ప్రవేశానికి మొదలు ఉండే ధ్వజ స్తంబము పూర్తిగా రాతితో నిర్మించి ఉంటుంది. ఈ ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. కేవలం ద్వి చక్ర వాహనాలు మాత్రమే పార్కింగ్ సౌకర్యం కలదు. త్రీ చక్ర , కార్ , బస్ , భారీ వాహనాల పార్కింగ్ సౌకర్యం లేదు. 

ఈ ఆలయంలో శివ విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. అందరూ ప్రతి రోజు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. చాలా పెద్ద విగ్రహం కావడం వల్ల చక్కగా విభూతి , గంధం తో అలంకరణ చేస్తారు. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని బండ్లగూడ జాగీర్ వద్ద ఈ ఆలయం కలదు. ఈ ఆలయం కొంచం లోపలికి ఉంటుంది. ప్రతి సోమవారం విశేష అభిషేకాలు జరుగుతాయి. 

శివరాత్రి రోజున  2 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అభిషేకం చేసుకోవాలి అని అనుకునే వారు ముందుగా టికెట్ తీసుకోవాలి. 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్

సాయంత్రం : 04:00 నుంచి 08:00 

#Sri Shivalayam Temple #Bandlaguda #Jagir  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana