Sri Ramachandra Swamy Temple | Shatamrai | Shamshabad | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 300 సం కంటే ముందూ నుంచే ఇక్కడ కొలువై ఉన్నది అని భక్తులు చెపుతారు. ఈ ఆలయాన్ని శ్రీ రామచంద్ర స్వామి ఆలయంగా పిలుస్తారు.
ఈ ఆలయం హైదరాబాద్ లోని శాతంరాయి అనే గ్రామానికి దగ్గరలో శంషాబాద్ కి వెళ్ళే రోడ్ మార్గం లో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయము బయట ద్వి చక్ర , త్రీ చక్ర , కార్ , బస్ , లారీ నుంచి భారీ నుంచి అతి భారీ వాహనాలు నిలుపడానికి స్థలం ఉన్నది.
ఈ ఆలయం పూర్తిగా రాతి తో నిర్మించారు. చాలా పాత ఆలయం కావడం వల్ల ఆలయ గోపురం శిధిలావస్థ కి చేరుకోవడం వల్ల భక్తులు అందరూ కలిసి పునః నిర్మాణం చేశారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి ఐన శ్రీ రామ చంద్ర స్వామి తో పాటు ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ గణపతి స్వామీ ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , శ్రీ రామచంద్ర స్వామి కూడా ఉన్నాయి.
ప్రతి సం || శ్రీ సీతారామ కళ్యాణం , శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున అందరికీ ఆన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 03:30 బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 08:00 వరకు
#Sri Ramachandra Swamy Temple #Shatamrai #Shamshabad #Hyderabad

Comments
Post a Comment