Sri Radha Krishna Mandir | Shivaram Pally | NPA | Hyderabad

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం సుమారు 35 సంవత్సరాల నుంచి కలదు. పూర్వం ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు కొంచం అభివృద్ది చేశారు. ఈ ఆలయానికి చాలా మంది ఉత్తర భారత భక్తులు రావడం ఇక్కడి ప్రత్యేకత. 

ఈ ఆలయం హైదరబాద్ లోని శివరాం పల్లి వద్దగల నేషనల్ పోలీసు అకాడమీ కి ఎదురుగా మరియు సరిగ్గా మహేశ్ విధ్య భవన్ అనే స్కూల్ కి పక్కనే కలదు. ప్రతి రోజు ఉదయం కొద్ది మంది పిల్లలు ఈ స్వామి దర్శనం  చేసుకుంటారు. 

ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. సాయంకాల సమయంలో ఈ ఆలయం దర్శించడం మంచిది. 

ఈ ఆలయంలో అందమైన శ్రీ రాధా కృష్ణ విగ్రహాలతో పాటుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , శివాలయం , ప్రత్యేకమైన నవగ్రహ ఆలయం , గణపతి ఆలయం కూడా ఉన్నాయి. గణపతి నవరాత్రి పూజలు మరియు దేవి నవరాత్రి పూజలు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్

సాయంత్రం : 04:30 నుంచి 08:30వరకు 


#Sri radha Krishna Mandir  #Shivaram Pally  #NPA  #Hyderabad

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana