Sri Kalika Mata Temple | Langar House | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సంరక్షించే వారు మన భారతీయ ఆర్మీ వాళ్ళు అని మీకు తెలుసా ? ఈ ఆలయాన్ని 1970 సం ప్రారంభించి 1972 సం || కలకత్తా నుంచి ఈ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ట చేశారు. ఈ ఆలయం ఇప్పుడు చాలా పెద్దగా నిర్మించారు. పాత రోజులలో ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది. కానీ రోజులు మరే కొలది ఈ అమ్మవారిని కొలిచే భక్తులు అధికంగా మార్పు చెందినది. 

ఈ ఆలయం చిల్కూరు బాలాజి స్వామి ఆలయం కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఆ ఆలయానికి వెళ్ళే భక్తులు తిరిగి వచ్చే సమయంలో లేదా వెళ్ళే సమయంలో ఈ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఈ దేవాలయం హైదరబాద్ లోని మెహిందిపట్నం నుంచి లంగర్ హౌస్ మీదుగా ఈ కాళీ అమ్మవారి ఆలయంనికి దారి ఉన్నది. 

లంగర్ హౌస్ అనే ఈ ప్రాంతాని పరిపాలించే గోల్కొండ కోట యొక్క ఏనుగులకి ఆహారం ఇచ్చే ప్రాంతం ఇది. మరియు అక్కడి సైనికులకు కూడా ఇక్కడే ఆహారం ఇచ్చే వారు కాలక్రమంలో ఇది లంగర్ హౌస్ గా మార్పు చెందినది. 

ఇక్కడ ప్రధానంగా అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. యటాలను బలి ఇచ్చి  అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అక్కడే సాయంత్రం వరకు ఉంది ఆ ఆహారాన్ని తింటారు. ఇక్కడ వాహనాల పూజలు కూడా చాలా ఎక్కువ జరుగుతాయి. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 01:00 

మధ్యాన్నం : 01:00 నుంచి 01:30 బ్రేక్ 

తిరిగి 01:30 నుంచి రాత్రి 09:00 


#Sri Kalika Mata Temple #Army  #Langar House  #Hyderabad




Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

KALIKA Matha Temple | Miyapur | Hyderabad | Hindu Temples Guide