Sri Gouri Shankar Swamy Temple | AG College | Rajendhra Nagar | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం నిర్మించి సుమారు 15 సం || పైనే జరిగినది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం కానీ ఈ ఆలయం చాలా లోపల ఉండడం వల్ల ఎక్కువ మందికి తెలియడం లేదు. ఈ ఆలయానికి సరియైన మార్గం లేకపోవడం వల్ల మరియు ఈ ఆలయానికి సరియైన సైన్ బోర్డులు లేకపోవడం వల్ల ఈ ఆలయం చాలా మందికి తెలియదు.
ఈ ఆలయం లో చాలా ఉప ఆలయాలు ఉన్నాయి. మొదట శ్రీ గణపతి ఆలయం, శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం , శివ ఆలయం , శ్రీ గౌరి దేవి ఆలయం , శ్రీ కృష్ణ స్వామి దేవాలయం , నవగ్రహ మండపం , హోమ గుండం , చిన్న గొశాల కలవు.
ఈ ఆలయంలో గణపతి నవరాత్రులు , దేవి నవరాత్రులు , స్కంద షష్టి , శివరాత్రి ఉత్సవాలు , వైకుంఠ ఏకాదశి , ఇతర పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. పక్కనే ఆచార్య ఎన్‌జి రంగా యునివర్సిటీ ఉండడం వల్ల కాలేజీ లోని పిల్లలు వచ్చి దర్శించుకునే వారు దర్శించుకుంటారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:30 వరకు
#Sri Gouri Shankar Swamy Temple #AG College #Rajendhra Nagar #Hyderabad

Comments
Post a Comment