Sphatika Shiva Temple | Shatamrai | Gaganpahad | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చాలా లోపలికి ఉండడం వల్ల సరిగ్గా ప్రసిద్ది చెందలేదు. ఈ ఆలయం 2 అంతస్తులలో ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా పూజ సమన్లు ఉంటాయి. మెట్లు ఎక్కితే మొదటి అంతస్తులో శివ ఆలయం ఉంటుంది. 

ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడి శివ లింగము శుద్ద స్పటిక లింగము. కింద అంతా రాతి తో నిర్మించి ఉంటుంది. ప్రతి రోజు స్వామి కి అభిషేకం చేస్తారు. మాస శివరాత్రి రోజున మహా శివ రాత్రి రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. వాటి కోసం టికెట్ తీసుకోవాలి. 

ఈ దేవాలయం హైదరబాద్ లోని శంషాబాద్ కి వెళ్ళే దారిలో శాతం రాయ్ అనే గ్రామానికి మరియు గగన్ పహాడ్ కి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చిన్నగా ఉన్నా లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి రోజు సాయంత్రం 07:00 గంటలకి ప్రత్యేక హారతి ఇస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్

సాయంత్రం : 04:00 నుంచి 08:00 


#Sphatika Shiva Temple  #Shatamrai  #Gaganpahad  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana