Shiva Hanuman Temple | Raju Swamyji Temple | Rajendhra Nagar | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో ప్రధానంగా శివలింగం మరియు శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు.
ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ 25 అడుగుల భారీ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది. మనం ఆలయ ఆవరణలో చాలా పెద్ద పార్కింగ్ సౌకర్యం ఉన్నది. ఈ ఆలయాన్నికి డైరెక్ట్ బస్ సౌకర్యం లేకపోయిన ఆటొ లు మాత్రం వస్తు ఉంటాయి.
ఈ ఆలయం హైదరబాద్ లోని రాజేంధ్ర నగర్ వద్ద హిమాయత్ సాగర్ డ్యామ్ కి వెళ్ళే దారిలో ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం చిన్నగా కనిపించిన కూడా ఈ ఆలయంలో లభించే ప్రశాంతత ఎక్కడ కూడా లభించదు. ఈ ఆలయం ఆవరణలో మనకి చాలా నెమలీలు , కుందేలు మరియు ఇతర వన్య ప్రాణులు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే రాజు స్వామి అనే ఆశ్రమం కూడా ఉన్నది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 03:00 బ్రేక్
సాయంత్రం : 03:00 నుంచి 07:30 వరకు
#Shiva Hanuman Temple #Raju Swamyji Temple #Rajendhra Nagar #Hyderabad

Comments
Post a Comment