Satsang Vihar Temple | Dairy Farm | Upperpally | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం 20 సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ ఆలయం ఇక్కడ ఉన్నది. కానీ చాలా సం || సమయం పట్టినది ఈ ఆలయం పూర్తి చేయడానికి.
ఈ ఆలయం హైదరబాద్ లోని రాజేంధ్ర నగర్ వద్ద గల డైరీ ఫార్మ్ x రోడ్ నుంచి కొద్ది దూరంలోనే ఈ ఆలయం కలదు. ఈ ఆలయం ఉదయం మరియు సాయంత్రం సమయం లలో దర్శించడం ఉత్తమం. ఈ ఆలయం 1994 లో ఈ ఆలయం ఇక్కడ నిర్మించాలి అని స్థలం తీసుకొని, 2004 లో ప్రధాన ఆలయం నిర్మించడం ప్రారంభించి 06 సం || తరువాత 2010 లో పూర్తి జరిగిన తరువాత 2011 నుంచి కుంభిషేకం చేసి ఆలయ దర్శనం అందరికీ దర్శించే అవకాశం కల్పించారు. ఆ రోజు సుమారు 10,000 వరకు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ జరిపించారు.
ఈ ఆలయం పూర్తిగా కలకత్తా రాష్ట్ర ఆలయ రూపం తో కలిసి ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించే ఈ ఆలయ భక్తులు ఆడవారు పూర్తిగా తెలుపు రంగు చీర , పురుషులు తెలుపు రంగు పంచ మరియు దొతి లేదా తెలుగు రంగు పంట్ మరియు షర్ట్ దరిస్తారు.
ఈ ఆలయం సరిగ్గా దర్శిస్తే కలకత్తా శ్రీ రామ కృష్ణ మఠం వలె ఉంటుంది. ప్రతి సం || అంగరంగ వైభవంగా 1 సారి ఉత్సవాలు నిర్వహిస్తారు. అప్పుడు ఈ ఆలయం దర్శించడానికి దాదాపు 15000 కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు. అప్పుడు ఆన్నదాన కార్యక్రమం మరియు భజన కార్యక్రమాలు జరుగుతాయి.
ఆలయ సందర్శన సమయం :
ఉదయం 06:00 నుంచి 12:30
మధ్యాన్నం : 12:30 నుంచి 01:00 బ్రేక్
సాయంత్రం : 01:00 నుంచి 07:00 వరకు మాత్రమే.
#Satsang Vihar Temple #Dairy Farm #Upperpally #RajendhraNagar #Hyderabad

Comments
Post a Comment