Sangam Sri Ramalayam | Bapu Nagar | Langar House | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడి భక్తులు ఈ ఆలయన్ని సంగం శ్రీ రామాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం బయటి నుంచి చూస్తే చిన్నగా కనిపించిన లోపల మాత్రం పెద్దగానే ఉంటుంది.
ఈ ఆలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శివాలయం , దుర్గా మాత ఆలయం, నవగ్రహ మండపం , శ్రీ గణపతి ఆలయం , చిన్న గొశాల కూడా ఉన్నది. ఇక్కడ వాహనాల పూజలు కూడా జరుగుతాయి. ఈ ఆలయం లంగర్ హౌస్ కి కొద్ది దూరంలో మరియు బాపు ఘాట్ కి కొద్ది దూరంలోనే ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతి సం || మహా శివరాత్రి రోజున రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఈ ఆలయం మెహిందిపట్నం కి కేవలం 05కి.మీ దూరంలోనే ఉంటుంది.
ప్రతి నెల ఏకాదశి రోజున మధ్యాన్నం అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆలయంలో శ్రీ రామ నవమి మరియు ఆంజనేయ జయంతి చాలా ఘనంగా జరుగుతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 05:30 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 09:30
#Sangam Sri Ramalayam #Bapu Nagar #Langar House #Hyderabad

Comments
Post a Comment