Ayodhyanath Swamy Temple | Shastrypuram | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. హైదరబాద్ లో ఇలాంటి ఆలయం ఉండడం మన అందరి అదృస్టమ్ గా చెప్పవచ్చు. ఈ దేవాలయాన్ని దర్శించాలి అంటే మనం ఒక్కపుడు పూర్తిగా హిందూ ప్రాంతంగా ఉండి ఇప్పుడు పూర్తిగా ఇతర మతాల ప్రాంతాల అధీనంలోకి వెళ్లిపోయింది.
కానీ ఈ ఒక్క ఆలయాన్ని మాత్రం ఎవ్వరూ టచ్ కూడా చేయలేక పోయారు. ఈ దేవాలయం హైదరబాద్ లోని జోపిడి అతి చేరువలో ఉన్న శాస్త్రి పురం వద్ద కలదు. శివరాం పల్లి నుంచి ఈ ఆలయం కేవలం 05కి.మీ దూరంలోనే ఉంటుంది.
ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఏకా శిలా విగ్రహం మీద 16 విగ్రహాలు చెక్కరు. విష్ణు స్వరూపం మొత్తం ఇక్కడ దర్శించవచ్చు. విష్ణు స్వామి సలిగ్రామాలు కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చూడడానికి చిన్నగా ఒక్కసారి ఇన్ని విగ్రహాలు అది కూడా ఏకా శిలా విగ్రహాలు చూడగానే మనస్సు చాలా ఆనందం పొందుతుంది.
వైకుంఠ ఏకాదశి , శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ జయంతి , శ్రీ లక్ష్మినరసింహ స్వామి జయంతి , సీతా రాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 03:00 బ్రేక్
సాయంత్రం : 03:00 నుంచి 08:00
#Ayodhyanath Swamy Temple #Shastrypuram #Hyderabad

Comments
Post a Comment