Sri Raja Rajeshwari Temple | Vemulawada | Siricilla | Telangana | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం తెలంగాణాలోని సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ గ్రామంలో ఉన్నది. తెలంగాణా లోని ప్రసిద్ద ఆలయలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర కలదు.
ఈ ఆలయంలో మనకి విష్ణు , మహేశ్వరులు ఒక్కటే ఆలయంలో దర్శించుకోవచ్చు. అందుకే ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారు. ఈ ఆలయంలో స్వామి నీలలోహిత శివలింగం గా కనిపిస్తారు. ఈ ఆలయం గురించి భవిష్యతర పురాణం లో ఈ ఆలయం గురించి తెలిపారు.
ఈ దేవాలయాన్ని రాజా నరేంద్ర రాజులు నిర్మించారు అని చరిత్ర. 1992 సం || ఈ ఆలయం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళినది. ప్రతి సోమవారం ఈ ఆలయంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. శనివరం , ఆదివారం , సోమవారం రోజులలో ఈ ఆలయం దర్శనం చేయడం కొంచం ఆలస్యం అవుతుంది. ఈ ఆలయంలో మొదట శ్రీ గణపతి శ్రీ ఆంజనేయ స్వామి , శివాలయం(రాజన్న) , అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి దర్శనం చేసుకుంటాం. ఈ ఆలయం చుట్టూపక్కల చాలా ప్రైవేట్ హోటల్ , సత్రాలు కూడా విశ్రాంతి గదులు కలవు.
ఈ ఆలయం నుంచి బస్ స్టాండ్ కి కొద్ది దూరంలోనే ఉన్నది. నడుచుకుంటూ లేదా ఆటో లో కూడా వెళ్ళవచ్చు. సెలవు రోజులలో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. దర్శనానికి సుమారు 03 నుంచి 04 గంటలు సమయం పట్టవచ్చు. మిగిలిన రోజులలో కేవలం 20 నుంచి 30 నిమిషాలలో దర్శనం ఐపోతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 01:00
మధ్యాన్నం : 01:00 నుంచి 03:00 బ్రేక్
సాయంత్రం : 03:00 నుంచి 08:30 వరకు
#Sri Raja Rajeshwari Temple #Vemulawada #Siricilla #Telangana #Hindu Temples Guide

Comments
Post a Comment