Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈలాంటి దేవాలయం ప్రపంచంలో ఎక్కడ లేదు. అంతటి గొప్ప దేవాలయం మాన ఈ దేవాలయం. ఇంతటి గొప్ప దేవాలయం మన తెలంగాణాలో ఉండడం మన అందరి అదృష్టం. ఈ ఆలయం లో స్వామి ఒకే రాతి పై పక్క పక్కనే రెండు శివలింగములుగా దర్శనం ఇస్తారు. ఈ ఆలయం తెలంగాణా లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గ్రామంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం గా పిలువబడుతుంది.
ఈ దేవాలయం మొత్తం దట్టమైన అడివిలో , ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతికి చాలా దగ్గరగా ఈ ఆలయం ఉంటుంది. ఈ దేవాలయం పక్కనే సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. గత నెల మే లో 13 నుంచి 26 సరస్వతి నది పుష్కరాలు జరిగినాయి. కొన్ని లక్షల మంది భక్తులు పవిత్ర నదిలో పుష్కరనది స్నానాలు ఆచరించారు. ఈ ఆలయంలో ఒక్క రాతి పై రెండు శివలింగలు దర్శించవచ్చు. ఒకటి ముక్తేశ్వరం మారియొక్కటి కాళేశ్వర స్వామి.
ముక్తేశ్వర స్వామి ని దర్శించుకునంత మాత్రం చేత ముక్తి లభిస్తుంది. దాని వల్ల యమరాజు యమపాశం పడదు అని అంటారు. తరువాత యమధర్మ రాజు శివయ్యని వేడుకోగా అప్పటి నుంచి కేవలం తనని దర్శనం చేస్తుకుంటే యమపాశం పడుతుంది. తప్పకుండా ముక్తేశ్వర స్వామితో పాటు కాళేశ్వర(యమధర్మరాజు) స్వామిని కూడా దర్శనం చేసుకుంటేనే అసలైన దర్శనం చేసుకున్న వారు అని చెపుతారు. ఇలా ఇద్దరినీ దర్శించుకుంటేనే మోక్షప్రాప్తి లభిస్తుంది అని చరిత్ర. ఇక్కడ మారియొక్క ప్రత్యేకత ఉన్నది. ముక్తేశ్వర స్వామి లింగం మీద అభిషేకం చేస్తే ఆ అభిషేక నీరు ఆలయనికి కొద్ది దూరంలో ఉండే గోదావరి నది , ప్రాణహిత సంగంలో నీరు కలుస్తుంది అని అంటారు. ప్రతి సం || శివరాత్రి రోజు చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఉదయం 04:00 నుంచే స్వామీ వారికి సుప్రభాత సేవ నుంచే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు సాయంత్రం 05:00 గంటలకి ముకేశ్వర , శుభనంధ దేవి కళ్యాణం జరుగుతుంది. రాత్రి 11:30 యగశాల లో హోమం నిర్వహించి అర్ధ రాత్రి 12:00 గంటలకి మొదట గణపతిని పూజ చేసి ఆలయ గర్భగుడిలోని రెండు శివలింగలకి ఏకకాలంలో మహా అభిషేకం , లింగోద్భవం పూజ , చండీ హోమం చేస్తారు. ఉదయం తీరిగీ మహా రుద్రాభిషేకం చేసి సాయంత్రం ఏకాంత సేవ చేసి తరువాత పూజ ముగుస్తుంది.
ఈ ఆలయం చేరుకోవడానికి డైరక్ట్ రైలు సౌకర్యం లేదు. 100 కి. మీ దూరంలో రామగుండం రైల్వే స్టేషన్ కలదు. అక్కడి నుంచి బస్ లో ఈ ఆలయానికి నేరుగా చేరుకోవచ్చు. లేదా హైదరాబాద్ mgbs మరియు jbs బస్ స్టాండ్ నుంచి ఈ ఆలయానికి డైరక్ట్ గా చేరుకోవచ్చు. ప్రైవేట్ వాహనలలో ఈ ఆలయానికి కూడా చేరుకోవచ్చు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 01:00
మధ్యాన్నం : 01:00 నుంచి 03:30 బ్రేక్
సాయంత్రం : 03:30 నుంచి 08:00 వరకు
#Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam #Kaleshwaram Temple #Telangana

Comments
Post a Comment