Bhadra Kali Temple | Warangal | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 165కి. మీ దూరంలోను మరియు వరంగల్ కి 06 కి. మీ  దూరంలోను హన్మకొండ కి  05కి. మీ దూరంలోను ఉన్నది. ఈ ఆలయం వరంగల్ లో చాలా ప్రసిద్దమైన ఆలయం. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ అమ్మవారి దర్శనం కొరకు తెలంగాణా నుంచి మాత్రమే కాకుండా మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు వస్తారు. 

ఈ ఆలయాన్ని చాళుక్య  రాజవంశానికి చెందిన రాజు రెండవ పులకేశి 625 CEలో సమైఖ్య రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని వేంగి ప్రాంతంపై తన విజయానికి గుర్తుగా నిర్మించాడని నమ్ముతారు. కాలక్రమంలో ఇప్పుడు వరంగల్ గా మార్పు చెందినది. 

పురాణాల ప్రకారం మనకి ప్రధానంగా 108 దేవి ఆలయాలు ఉన్నాయి. అందులో మళ్ళీ 51 ప్రాముఖ్యం ఉండగా మళ్ళీ ఇందులో 18 అష్టదశ శక్తి కేంద్రాలుగా ఉన్నది. ఈ 51 ఉన్న ఆలయలలో ఈ ఆలయం 51వ ఆలయం. ఈ ఆలయంలో దసరా నవరాత్రులు మరియు వసంత నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ తప్పకుండా అమ్మవారికి పసుపు నీటితో జరిగే అభిషేకం తప్పకుండా చూసి తీరాలి. వీటికోసం ప్రత్యేక టికెట్ లు ఉంటాయి. ముందుగా వాటిని తీసుకొవాలి. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 01:00 

మధ్యాన్నం : 01:00 నుంచి 03:00 బ్రేక్ 

సాయంత్రం : 03:00 నుంచి 08:00 


#Bhadra Kali Temple  #Warangal  #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana