Telangana’s 2nd biggest Tribal Festival | Nagoba Jatara | Keslapur | Adilabad | Hindu Temples Guide

 


ఇది ప్రపంచంలోనే ప్రాచీన రెండవ గిరిజనుల జాతర. ఇది మన తెలంగాణలో ఉండడం మనకి గర్వకారణం. ఇది మన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం , కేసలాపూర్ గ్రామం లో జరుగుతుంది. ఇది చాలా పురాతన ఆలయం మరియు పురాతన జాతర. 

ప్రతి సం || పుష్య మాసం ప్రారంభం కాగానే జాతర ప్రారంభం అవుతుంది. దాదాపు నెల రోజుల పాటు భారీ ఎత్తున జాతర నిర్వహిస్తారు. అసలైన ఘట్టం 15 రోజుల తరువాత ప్రారంభం అవుతుంది. ఇక్కడ మాఘ మాసం అమావాస్య రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పుష్య మాసం రాగానే ఆదిలాబాద్ కి దగ్గరలో గల గోదావరి నదికి పాద యాత్రగా వెళ్ళి నీటిని తీసుకొని వచ్చి స్వామి కి అభిషేకం చేస్తారు.  అదికూడా మాఘ మాసంలోని అమావాస్యరోజున అభిషేకం చేస్తారు. ఇక్కడ స్వామి ఏదో ఒక సమయంలో పాము రూపంలో వచ్చి పూజలు స్వీకరిస్తారు అని భక్తుల నమ్మకం. 

ఇలా మాఘమాసంలో ఒక రోజు దర్భర్ నిర్వహిస్తారు. ఆ రోజు అందరూ కలిసి దేవాలయం లో పూజలు నిర్వహించి మధ్యాన్నం అందరూ కలిసి అన్నప్రసాద వితరణ కూడా చేస్తారు. ఆ తరువాత గ్రామంలోని ప్రధాన సమస్యలపై అందరూ కలిసి చర్చ నిర్వహిస్తారు. ఇలా కొని వందల సం|| నుంచి ఈ ఆచారం జరుగుతుంది. ఈ జాతర ని చూడడానికి కేవలం ఆ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా మహారాష్ట్ర , కర్ణాటక , మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు విచ్చేస్తారు. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం ; 08:00 నుంచి 12:30 

మధ్యన్నం : 12:30 నుంచి 03;30 బ్రేక్ 

సాయంత్రం : 03:30 నుంచి 07;00 మాత్రమే. 


#Telangana’s 2nd biggest Tribal Festival #Nagoba Jatara #Keslapur #Adilabad #Hindu Temples Guide


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana