Sri Venkateshwara Swamy Temple | Srinagar Colony | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 1963 నుంచి ఈ ఆలయం ఉన్నది. కాలక్రమేణా ఆలయాన్ని అభివృద్ది చేస్తూ వచ్చారు. ఈ ఆలయం వల్లనే ఈ ప్రాంతానికి చాలా లాభం వచ్చిన్నది. ఈ ఆలయం బాగా అభివృద్ది చెందడం వల్ల ఈ చుట్టూ పక్కల ప్రాంతానికి మంచి రెక్కలు వచ్చాయి. మనకి విజయ్ దేవరకొండ యొక్క సినిమా ఐన గీతగోవిందం సినిమా లోని చాలా సన్నివేశాలు ఈ ఆలయంలోనే చిత్రీకరించారు.
ఈ ఆలయం ప్రారంభం లోనే చక్కటి గోపురం కనిపిస్తుంది. ఆది దాటి వెళితే చక్కటి శ్రీ మహా విష్ణు అదిశేషుడి పై ఉన్న విగ్రహం కనిపిస్తుంది. అది దాటి వెళితే ఆలయం యొక్క ప్రధాన గోపురం కనిపిస్తుంది. తరువాత ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇక్కడ కుడి వైపున యాగ శాల ఉంటుంది. తరువాత ఆలయం లోనికి వెలుతాము.
ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజూ రద్దీ చాలా అధికంగా ఉంటుంది. దీపావళి రోజు మరియు దసరా రోజు కూడా రద్దీ అధికంగా ఉంటుంది. ఆలయం లో అర్చన మరియు అభిషేకం చేపించుకోవడానికి ముందు రోజు టికెట్ తీసుకోవడం మంచిది. అర్చన మరియు ఇతర పూజలు చేపించుకోవాలి అని అనుకునే వారు సంప్రదాయ దుస్తులలో వెళ్ళాలి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:45 వరకు
#Sri Venkateshwara Swamy Temple #Srinagar Colony #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment