Sri Veera Hanuman Temple | Paradise | Secunderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. హైదరాబాద్ లో చూడవలసిన హనుయాన్ ఆలయలలో ఈ ఆలయం కూడా ఒకటి.
ఈ ఆలయం హైదరాబాద్ లోని సికింద్రాబాద్ వద్ద గల రామ్గోపాల్ పేట , సర్దార్ వల్లభాయి పటేల్ (s.p) రోడ్డు మీదుగా వెళుతుంటే వస్తుంది.
ఈ ఆలయం లో మనకి ప్రతి మంగళవారం , శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామి వారికి అర్చన అభిషేకం కోసం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ స్వామి వారికి హోమం కూడా చేస్తారు. ప్రత్యేక రోజులలో ఇక్కడ హోమం కూడా చేపిస్తారు.
ఈ ఆలయంలో మనం శ్రీ ఆంజనేయ స్వామి తో పాటు శ్రీ గణపతి ఆలయం, శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం , శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి , నాగేంద్ర స్వామి , శ్రీ దుర్గా దేవి , శ్రీ సాయి బాబా ఆలయం , శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం , శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి ఆలయం , శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలు కూడా ఉన్నాయి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:45 వరకు
#Sri Veera Hanuman Temple #Paradise #Secunderabad #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment