Sri Palugu Nala Pochamma Thalli Temple | Sherkhan Palli | Narsapur | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 300 సం || క్రితమే నిర్మించారు. బయటి నుంచి చూస్తే ఈ ఆలయం చాలా పెద్దగా కనిపించిన లోపల చాలా చిన్నగా ఉంటుంది అమ్మవారి ఆలయం. కానీ చాలా శక్తివంతమైన ఆలయం.
ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 55 కి.మీ దూరంలోను , నర్సాపూర్ గ్రామానికి 12 కి. మీ దూరంలోను మరియు ఈ ఆలయం ఏడుపాయాల వనదుర్గా దేవి వెళ్ళే దారిలో ఈ ఆలయం కంటె ముందే ఈ ఆలయం వస్తుంది.
ఇక్కడ అమ్మవారిని పూర్తిగా నల్లరాతి తో నిర్మించారు. ప్రతి రోజు అమ్మవారికి పసుపు తో అలంకరణ చేస్తారు. నిజరూప దర్శనం చేసుకోవాలి అంటే అమ్మవారికి అభిషేకం చేసే సమయంలో చూడవచ్చు.
ప్రతి అదివారం రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పూర్తిగా తెలంగాణ సంప్రదాయ ఆలయం కనిపిస్తుంది. అంటే అమ్మవారికి మొక్కుకొని కోరిక తీరిన తారువత కల్లు , మేకలు , కోళ్ళు అమ్మవారికి బలి ఇచ్చి అమ్మవారికి నైవేద్యాం గా సమర్పిస్తారు.
ఇక్కడ కూడా మనకి శ్రీశైలం లో వలె అంతరాలయం లోకి వెళ్ళవచ్చు. అమ్మవారు ఒక గట్టు మీద కూర్చొని ఉంటారు. బోనాలు ఇక్కడ కూడా సమర్పిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:30
మధ్యాన్నం : 01:00 నుంచి 03:00 బ్రేక్
సాయంత్రం : 03:00 నుంచి 07:00 వరకు మాత్రమే
#Sri Palugu Nala Pochamma Thalli Temple #Sherkhan Palli | #Narsapur #Hindu Temples Guide

Comments
Post a Comment