Sri Nimishambika Devi Temple | Pentareddy colony | Boduppal | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన  అమ్మవారు. ఈ ఆలయం మనకి చూడడానికి చిన్నగా కనిపించిన కూడా చాలా ప్రసిద్ది చెందిన ఆలయం. హైదరాబాద్ లోని బొడుఉప్పల్ గ్రామానికి కొద్ది దూరంలో పెంటరెడ్డి కాలనీలో ఈ ఆలయం కలదు. హైదరాబాద్ నుంచి మొదట బొడుఉప్పల్ కి చేరుకొని అక్కడి నుంచి ఈ ఆలయానికి ఆటోలో చేరుకోవచ్చు.

ఇక్కడ అమ్మవారి అంత ప్రసిద్ది చెందడానికి గల కారణం ఇక్కడ అమ్మవారి మొదట 16 ప్రదక్షిణలు చేసి ఒక కోరిక కోరుకోవాలి. అది తీరిన తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి. మొదట చేసిన ప్రదక్షిణలు ఆ నిమిషంలో కోరిన కోరికలు నెరవవేరుతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం. అది కూడా ధర్మబద్దమైన కోరికలు అయి ఉంటే మాత్రమే నెరవేరుతాయి. 

ఇక్కడ దసరా , దీపావళి , బోనాల పండుగ చాలా వైభవంగా జరుగుతాయి. దసరా సమయంలో 9 రోజులు హోమం , అర్చన , విశేష అభిషేకం చేస్తారు. ప్రతి మంగళవారం , శుక్రవారం అధిక రద్దీ ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 07:45 వరకు 


#Sri Nimishambika Devi Temple #Pentareddy colony #Boduppal  #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana