Sri Mallikarjuna Swamy Temple | Karanbagh | Saidabad | Hyderabad | Hindu temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 350 సం || చరిత్ర కలదు. ఈ ఆలయం హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ నుంచి కేవలం 5 కి. మీ దూరంలో కలదు. కరణ్ బాఘ్, సైదాబాద్ అనే గ్రామంలో కలదు. ఈ ఆలయం పూర్తిగా కోమరవేల్లి మల్లన స్వామి లనే ఉంటుంది. 

ఈ ఆలయని కోమరవేల్లి లోని పుట్ట మన్ను తీసుకొని వచ్చి స్వామి ఆలయాన్ని నిర్మించారు. సుమారు 6 దశబ్దాలు అనగా 60 సం || గా ఒకే కుటుంబ సభ్యులు ట్రస్ట్ గా ఆలయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

ఈ ఆలయంలో బోనాల పండుగ , దసరా , దీపావళి చాలా ఘనంగా జరుపుతారు. ఇక్కడ శ్రీ మల్లన్న స్వామి తో పాటు దుర్గా దేవి , సాయి బాబా ఆలయం , నాగ దేవత ఆలయం , ఇతర ఉప ఆలయాలు కలవు. 

ప్రతి సం || మల్లన స్వామి కళ్యాణం చాలా వైభవంగా జరుపుతారు. ఈ ఆలయంలో శ్రీ రేణుక ఎల్లమ్మ , పోచమ్మ , మహంకాళి అమ్మవారి ని ఏక పీఠం మీద దర్శించుకోవచ్చు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07 : 00 నుంచి 11 : 30 

మధ్యాన్నం : 11 : 30 నుంచి 04 : 30 బ్రేక్ 

సాయంత్రం : 04 : 30 నుంచి 08 : 00


#Sri Mallikarjuna Swamy Temple #Karanbagh #Saidabad #Hyderabad Temples #Hindu temples Guide 

Comments