Sri Lakshmi Narasimha Swamy Temple | Sultan Bazar | Koti | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి 400 సం || చరిత్ర కలదు. ఇక్కడ స్వామి స్వయంభు స్వామి.
ఈ ఆలయం కోటి వద్ద గల సుల్తాన్ బజార్ అనే ప్రాంతంలో కలదు. కానీ చాలా లోపాల ఉంటుంది. చాలా పురాతన ఆలయం కలవడం మరియు ఇప్పుడు చుట్టూ పక్కల అంతా పెద్ద పెద్ద ఇల్లులు కట్టడం వల్ల చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు.
ఈ ఆలయంలో మనకి ప్రారంభంలోనే ధ్వజ స్తంభం కనిపిస్తుంది. తరువాత దశ అవతారాలు తో చక్కటి శిల్ప మూర్తులు కనిపిస్తాయి. పంచముఖ శివలింగం ఇక్కడ మాత్రమే దర్శించవచ్చు. ఒకే లింగంలో ఇవి అని అని ఉంటాయి. తత్పురుష , అఘోరా , సజోజాత , వామదేవా , ఈశానముఖాలతో స్వామి దర్శనం ఇస్తారు. రామ ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా చూడవచ్చు. పండుగలలో రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం:
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:45 వరకు
#Sri Lakshmi Narasimha Swamy Temple #Sultan Bazar #Koti #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment