Sri Kalyana Venkateswara Swamy Vari Temple | Durga Nagar Colony | Punjagutta | Hyderabad | Hindu Temples Guide
శ్రీశ్రీశ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం హైదరాబాద్ లోని పంజగుట్ట వద్ద గల దుర్గా నగర్ కాలని వద్ద ఈ ఆలయం కలదు.
ఆలయ వ్యవస్థాపకులు శ్రీ రాజకుమార్ మాల్పానీ, శ్రీ పలమర్తి వేంకటేశ్వర్లు, శ్రీ జి. రామమోహన్ రావు, శ్రీ రామ మూర్తి, శ్రీ కోటేశ్వరరావు, శ్రీ ఎస్ వేంకటేశ్వరరావు, శ్రీ ముక్కర భాస్కర్ పంజగుట్ట, దుర్గానగర్ కాలనీలో ఈ భూమిని గుర్తించి ఆలయాన్ని నిర్మించారు.
శ్రీవేంకటేశ్వరస్వామి దేవతల విగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రసాదించారు. ఆ విధంగా 1993లో అంటే ‘ఆంగీరస నామ సంవత్సరం, రేవతి నక్షత్రం, మీన లగ్నం, మాఘ శుద్ధ షష్ఠి’ నాడు ఆలయంలో దేవతల మూర్తులను ప్రతిష్ఠించారు.
తిరుమల తిరుపతి దేవస్థానములు ఆచరిస్తున్న ‘వైఖానస ఆగమ సంప్రదాయం’ ప్రకారం ఈ దేవాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:30 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 05:30 బ్రేక్
సాయంత్రం : 05:30 నుంచి 08:30
#Sri Kalyana Venkateswara Swamy Vari Temple #Durga Nagar Colony #Panjagutta #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment