Sri Durga Mata Temple | Mailardevpally | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 35 సం || కంటే ముందు నుంచే కలదు. ఈ ఆలయం హైదరాబాద్ లోని దుర్గా నగర్ మరియు మైలారదేవ్ పల్లి అనే ప్రాంతానికి మధ్యలో కలదు. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటే మనస్సు చాలా ప్రశాంతత పొందుతుంది.
ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిశారు అని చరిత్ర. ఆలయం బయట మనకి చిన్న గో శాల కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆలయం లోపలకి వెళ్లగనే మొదట గణపతి దర్శనం తరువాత కుడి వైపున శివ ఆలయం , నాగ దేవత ఆలయం , ఇతర ఉప ఆలయాలు కలవు
ఈ దుర్గా మాతా ఆలయంలో ప్రతి సం || బోనాల పండుగ , దసరా , దీపావళి పండుగ చాలా బాగా జరుగుతుంది. దసరా పండుగ రోజు రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ప్రతి మంగళవారం , శుక్రవారం కుంకుమార్చన , ప్రత్యేక రోజుల్లో రుద్రాభిషేకం కూడా జరుగుతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:15 వరకు
#Sri Durga Mata Temple #Mailardevpally #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment