Rathnalayam Temple | Shamirpet | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం రత్నాలయం అని పేరు. ఈ ఆలయం హైదరాబాద్ లోని షామీర్పేట వద్ద కలదు. ఆలయం బయటనే మనకి టూ మరియు ఫోర్ వీలర్ పార్కింగ్ సౌకర్యం కలదు. ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. ఆలయం ప్రారంభం తరువాత పక్కన గోశాల కలదు. మరియు ఆలయం కుడి వైపున పిల్లల కోసం చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. 

ఆలయం ప్రారంభం తరువాత మనకి శ్రీ వినాయక స్వామి దర్శనం చేసుకోవచ్చు. తరువాత మొదటి ఫ్లోర్ కి చేరుకున్న తరువాత ఆలయ ధ్వజ స్తంభం కనిపిస్తుంది. 

ఇక్కడ స్వామి వారిని దర్శించుకోగానే మనకి సరిగ్గా తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ని చూసిన అనుభూతి కలుగుతుంది.  ఇక్కడ స్వామి సుమారు 10 అడుగుల ఎత్తు లో స్వామి వారు ఉంటారు. స్వామి వారికి అర్చన అభేషేకం చేసుకునే వారు ముందు రోజే టికెట్ తీసుకోవాలి. స్వామీ వారికి ఎదురుగా శ్రీ గరుడ స్వామి ఆలయం ఉంటుంది. 

కిందకి వచ్చిన తరువాత శ్రీ ఆంజనేయ స్వామి ని దర్శించుకోవచ్చు. స్వామి కి నూతనంగా కళ్యాణ మండపం కూడా నిర్మిస్తున్నారు. ఈ ఆలయం అంతా కింద పాల రాత్రి ఆలయం. ఇక్కడ తాబేలు కూడా ఉంటాయి. ఆలయం కింద మర్రి చెట్టు , జమ్మి చెట్టు , ఇతర చెట్టు కలవు. మనకి దీపావళి పండుగ రోజు కొందరు చెట్టుల పూజ లు చేస్తారు. అలాంటి వారి కోసమే ఇలా చెట్టులు నిర్మించారు. తరువాత శ్రీ మహా విష్ణువు , శ్రీ కృష్ణుడు వాటర్ ఫౌంటెన్ కూడా దర్శించుకోవచ్చు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:30 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00


#Rathnalayam Temple #Shamirpet #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana