Gattu Maisamma temple | Ghatkesar | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడ ప్రధాన దేవత అమ్మవారు. ఇక్కడ అమ్మవారు ఒక కొండ మీద ఉంటుంది. ఈ కొండ మీద అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా మెట్లు ఎక్కవలసి ఉంటుంది.ఈ ఆలయంలో అమ్మవారి పేరు గట్టు మైసమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు గుట్టలో గుహలో స్వయంభూగా వెలిసినది.  ఇది హైదరబాద్ కి కేవలం 27కి. మీ దూరంలో మరియు యాదగిరి గుట్ట కి వెళ్ళే దారిలో కలదు. 

ప్రతి సం || ఇక్కడ ఆషాడ మాసంలో బోనాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఒక చిన్న స్వరంగా మార్గం ఉన్నది. అక్కడి నుంచి మారియొక్క అమ్మవారిని దర్శించుకోవచ్చు. 

ఇది మన ఘాట్కేసర్ వద్ద కలదు. ఇక్కడ గుట్ట మీద ఉన్న అమ్మవారి పెయింటింగ్ ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది. ఈ ఆలయం ఏడుపాయాల వన దుర్గా దేవి లాగా ఉంటుంది. ఈ కొండ మీద నుంచి చూస్తే సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది. 

పూర్వం సరియైన మెట్ల మార్గం కూడా లేదు. కానీ ఇప్పుడు ఆలయం పైకి వెళ్ళడానికి  మెట్లు , ఆలయం కింద మార్గంలో ప్రత్యేక రూమ్ లు , షెడ్లు కలదు. ఇక్కడ ప్రతి సం || జనవరి నెలలో అమ్మవారికి జాతర నిర్వహిస్తారు. అప్పడు రద్దీ అధికంగా ఉంటుంది. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:30 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 03:30 బ్రేక్ 

సాయంత్రం : 03:30 నుంచి 07:00 వరకు మాత్రమే 


#Gattu Maisamma temple #Ghatkesar #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana