Film Nagar Daiva Sannidhanam | Film Nagar | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం హరిహరుల దేవాలయం. ఈ ఆలయం రెండు అంతస్థులలో ఉంటుంది. చక్కటి పార్కింగ్ స్థలం కూడా ఉన్నది. ఇక్కడ సినిమా షూటింగ్లు చాలా ఎక్కువ జరుగుతాయి.
ఈ ఆలయం బహు సుందరమైన ఆలయం. ఇక్కడ మొత్తం 17 ఆలయాలు కలవు. వాటిలో ప్రధానమైన దేవత మూర్తి శ్రీ శిరిడీ సాయిబాబా ఆలయం నమూనాగా ఉన్న ఆలయం. ఇక్కడ నటరాజ స్వామి తాండవ భంగిమ రూపంలో ఉంటాడు.
ఇక్కడ శబరిమల లోని అయ్యప్ప స్వామి వారి ఆలయం లాగా ఈ ఆలయం ఉంటుంది. రాజా గోపురం దాటగానే ధ్వజ స్తంభం కనిపిణిస్తుంది.
ఇక్కడ శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉన్నది. ఆలయం ప్రారంభంలోనే గణపతి , శివుడు , దుర్గా దేవి, శ్రీ దత్తాత్రేయ స్వామి, సాయి బాబా , శ్రీ ఆంజనేయ స్వామి , నవగ్రహ మండపం , శ్రీ మహావిష్ణువు ఇతర ఉప ఆలయలు కలవు.
దసరా , దీపావళి ,శ్రీ రామనవమి , సాయి బాబా ఉత్సవాలు , వైకుంఠ ఏకాదశి చాలా ఘనంగా జరుపుతారు. పండుగ సమయాలలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:30 వరకు
#Film Nagar Daiva Sannidhanam #Film Nagar #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment