Deshmukh Sai Baba Temple | Deshmukh | Nalgonda dist | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని యల్ . బి నగర్ నుంచి 30కి. మీ. దూరంలో కలదు. ఈ దేవాలయం 5 ఎకరాలలో ఉన్నది. రామోజీ ఫిలిమ్ సిటీ కి కేవలం 5కి. మీ దూరంలో కలదు.
మనకి ప్రారంభంలోనే పెద్ద హనుమాన్ విగ్రహం దర్శనం ఇస్తుంది. ఈ హనుమాన్ విగ్రహాన్ని చూడగానే మనస్సు ఇట్టే నిలిచిపోతుంది. ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉన్నది.
విగ్రహం ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నది. ఇక్కడి నుంచే ప్రధాన ఆలయం ప్రారంభం అవుతుంది. ప్రారంభం లోనే పెద్ద శివ విగ్రహం ధ్యాన ముద్రలో కనిపిస్తుంది.
ఇక్కడ పెద్ద ధ్యాన మందిరం కలదు. దీని ప్రక్కనే శ్రీ సాయి బాబా ఆలయం ఉన్నది. ఇక్కడ సాయి బాబా పూర్తిగా పాల రాతి తో నిర్మించిన ఆలయాం ఉన్నది. వెనుక వైపు మారియొక్క ఆలయం ఉన్నది. ప్రస్తుతం ఇది నిర్మాణ వస్తలో ఉన్నది. నిర్మాణ ఆలయం చాలా బాగా ఉన్నది. చివరి స్థానంలో ఉన్నది. ప్రస్తుతం పెయింటింగ్ పనిలో ఉన్నది. ఇక్కడ గోశాల కూడా ఉన్నది . సిటీకి కొద్ది దూరంలోనే ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం ఉండడం విశేషం.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:30 నుంచి 12:30
మధ్యాన్నం : 12:30 నుంచి 02:30 బ్రేక్
సాయంత్రం : 02:30 నుంచి 07:00 వరకు
#Deshmukh Sai Baba Temple #Deshmukh #Nalgonda dist #Hyderabad Temples #Hindu Temples Guide

Comments
Post a Comment