Sri Vendikonda Siddalingeshwara Temple| Shamshabad | Hindu temples guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని శంషాబాద్ నుంచి 3.5 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయం సినిమా షూటింగ్ లకి పెట్టింది పేరు. పూర్వం ఇక్కడ జయం , పూలరంగడు అనే సినిమా లు షూటింగ్ జరిగినాయి, 

ఈ ఆలయం ఆర్చ్ నుంచి ప్రారంభం కాగానే మొదట ఆలయం బయట నవగ్రహ మండపం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, ఆలయ కోనేరు ఉంటుంది. పైన తెల్లటి  వెండి రూపంలో శివయ్య స్వామి ప్రక్కనే శ్రీ దుర్గా దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం పూర్తిగా గుట్ట మీద ఉంటుంది. 

పూర్వం ఒక సాదువు కాశీ నుంచి వచ్చిన తరువాత ఈ గుట్ట మీద ధ్యానం చేసే వారు. అప్పుడు ఈ ప్రాంతం అంతా కరువు , విపరితమైన అనారోగ్య సమస్యలతో బాధ పడే వారు. అప్పుడు ఈ సన్యాసి అవి అని తొలగిపోవలీ అని శివయ్య కి గుట్ట మీద ఆలయం నిర్మించి శివయ్యని పూజ చేయడం వల్ల ఆ సమస్యలు అని తొలిగి పోయినాయి. అప్పటి నుంచి ఈ స్వామిని అక్కడి భక్తులు పూజ చేయడం ప్రారంభించారు. ఆ సిద్దుడి పేరు మీదనే ఈ ప్రాంతానికి సిద్దులా గుట్ట అనే పేరు వచ్చింది. మరియు ఇక్కడ స్వామి వారు తెల్లగా వెండి రూపంలో ఉండడం వల్ల ఇక్కడ స్వామికి వెండి మీదుగా వెండికొండ అనే పేరు వచ్చిన్నది. 

ఇక్కడ శివరాత్రి , దేవి నవరాత్రి , దీపావళి చాలా బాగా నిర్వహిస్తారు. అయ్యప్ప మాల వేసిన భక్తులు ఇక్కడ సాయంత్రం భజన చేసి ఇక్కడ నిద్ర పోతారు. ఈ ఆలయం చాలా ప్రశాంతం గా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 11:30 వరకు 

మధ్యాన్నం 11:30 నుంచి 4:00 వరకు బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 07:00 వరకు 


#Sri Vendikonda Siddalingeshwara Devastanam #Shamshabad #Hyderabad temples #Hindu temples guide

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana