Sri Sri Sri Mahankali Pochamma Temple | Indira Nagar | Khairtabad | Hyderabad | Hindu temples guide
ఈ ఆలయం పేరు శ్రీ శ్రీ శ్రీ మహంకాళి పోచమ్మ దేవాలయం, ఈ ఆలయం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ వద్ద గల లైన్ లో కలదు.
ఇది దాదాపు 500 సంవత్సరాల పురాతన దేవాలయం. మొదట్లో అమ్మవారి గుడి మాత్రమే ఉంటుంది. తరువాత ఇతర దేవాలయాలు అభివృద్ధి చెందాయి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మీరు సతీ సమేత నవగ్రహాలతో పాటు వారి నవగ్రహాల వాహనాలను చూడవచ్చు.
ఈ ఆలయంలో మహంకాళి అమ్మవారు మరియు రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం, పోచమ్మ తల్లి ఆలయం ,ముత్యాలమ్మ తల్లి ఆలయం , నవగ్రహాలు ఆలయాలు కలవు. ఈ ఆలయంలో బోనాల పండుగ చాలా బాగా జరుగుతుంది. మరియు దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా నిర్వహిస్తారు. ప్రత్యేక పండుగలలో ఆలయ రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30 వరకు
మధ్యాన్నం : 12:00 నుంచి 05 : 00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:30 వరకు
#Sri Sri Sri Mahankali Pochamma Temple #Indira Nagar #Khairtabad #Hyderabad temples #Hindu temples guide

Comments
Post a Comment