Sri Khilla maisamma temple | kothapet | Hindu temples guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దం కి చెందిన ఆలయం. అనగా ఈ ఆలయం సుమారు 450 సం|| క్రితం ఒక కొండ గుట్ట లోపల అమ్మవారు వేసినారు. ఇప్పటికి ఈ ఆలయం మనం కూడా కొండ లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు.
ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అనగా ఏ ఆలయంలో ఐన పురుషులు ఆలయం అర్చక స్వాములు ఉంటారు. ఇక్కడ మాత్రం అందుకు వ్యతిరేకంగా మహిళా మనులు అర్చక పని చేస్తారు.
ఈ ఆలయం కింద స్వరంగా మార్గాలు ఇప్పటికి ఉన్నాయి. కానీ మూసి వేసినారు. పూర్వం ఇక్కడ రాళ్ళు తో నిండి ఉండేది. ఈ అర్చక వంశానికి చెందిన ఒక మహిళా కట్టెల కోసం ఇక్కడ రాగా ఆమెకి అమ్మావారు దర్శనం ఇవగా ఆమె వెళ్ళి వల్ల ఇంటిలో చెప్పడం జరిగినది. అలా మరుసటి రోజు ఇంటిలోని అందరూ వచ్చి చూడగా అమ్మ వారు గుట్టల మధ్యలో కనిపించినది. ఆ రోజు నుంచి ఆ ఇంటికి వల్లే అమ్మవారు అర్చక వృత్తిలో ఉన్నారు. ఇప్పటికి ఇలా 13 మంది కోడళ్ళు అమ్మవారు అర్చక పని చేస్తున్నారు.
ఈ ఆలయం దిల్ సుఖనగర్ వద్ద నుంచి 2 కి. మీ దూరం వెళ్ళగా అక్కడ కొత్తపేటలోని ఒక గుట్ట లోపల అమ్మవారు కనిపిస్తుంది. అమ్మవారి విగ్రహం కింద స్వరంగా మార్గం కలదు. కొన్ని సం || క్రితం ఒక నాగ దేవత ఇక్కడ అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకునేది అని చరిత్ర చెపుతుంది.
ఈ ఆలయానికి ప్రతి శుక్రవారం ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దసరా , దీపావళి చాలా బాగా జరుగుతుంది.
ఆలయం దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00 వరకు
మధ్యాన్నం 12:00 నుంచి 04:00 వరకు బ్రేక్
సాయంత్రం 04:00 నుంచి 07:00 వరకు
#Sri Khilla maisamma temple #kothapet #Hyderabad temples #Hindu temples guide
Comments
Post a Comment