Shiva madir goshala | Shamshirgunj | Old city | Hindu temples guide

 

ఈ ఆలయం హైదరాబాద్ లోని పాతబస్తి లోని సంసిర్ గంజ్ వద్ద కలదు. ఈ ఆలయం ప్రస్తుతం ముస్లిం లు పరిపాలించే ప్రాంతంలో కలదు. చాలా సార్లు గిట్టని వారు దాడులు కూడా చేసిన తట్టుకొని నిలబడినరు. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివయ్య. ఇక్కడ శివయ్య మూర్తిని చూడగానే మనస్సు చాలా ప్రశాంతతని పొందుతుంది. ఈ ఆలయంలో శివయ్య తో పాటు శ్రీ రామ చంద్రమూర్తి , శ్రీ ఆంజనేయ స్వామి, దుర్గా దేవి కలదు. ఇక్కడ శ్రీ సీత రామ కళ్యాణం , శ్రీ రామ నవమి కూడా చాలా బాగా నిర్వహిస్తారు. 

ఈ ఆలయంలో మారియొక్క ప్రత్యేకత ఇక్కడ ఈ ఆలయం గోశాల మధ్యాలలో ఉంటుంది. ఇక్కడ సుమారు 3000 ఆవులు కలవు. చాలా పెద్ద గోశాల. వీటిని రక్షించుకోవడం మన అందరి భాద్యత. 

ఈ గోశాలలో కేవలం ఆవు పేడ తో తయారు చేసిన ధూపం స్టిక్ లు అమ్ముతారు. అవి కూడా మంచి సుగంద వాసన విరాజిమ్ముతాయి. ఇంటిలో కూడా ఆవు పేడ వెలిగిస్తే చాలా మంచిది. ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం 06:00 నుంచి 11:30 వరకు 

మధ్యాన్నం 11:30 నుంచి 04:00 వరకు బ్రేక్ 

సాయంత్రం 04:00 నుంచి 08:00 వరకు తెరిచి ఉంటుంది. 

ఇక్కడ శివరాత్రి చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం బయటి నుంచి చూస్తే  అస్సలు కనిపించదు. కానీ లోపల చాలా పెద్దగా ఉంటుంది. 


#Shiva madir goshala #Shamshirgunj #Old city #Hyderabad Temples  #Hindu temples guide 


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana