Kashibugga Temple | Kishan Bhag | Hyderguda | Attapur | Hyderabad
ఈ ఆలయాన్ని శ్రీ రాజా రాఘవ రాంజీ గారు నిర్మించారు. ఈ ఆలయం కిషన్ బాఘ్ అనే గ్రామం లో అత్తాపూర్ వద్ద కలదు, ఇప్పడు ఈ ప్రాంతం ముస్లింల ప్రాంతం కిందకి వెళ్ళిపోయింది. కానీ వాస్తవానికి కిషన్ బాఘ్ అంటే ఏదో ముస్లిం వ్యక్తి పేరు అని కాదు. సాక్షాత్ శ్రీ కృష్ణుడి పేరు మీదనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిన్నది.
అని గుడులవలే ఈ ఆలయం కనిపించదు. ఈ ఆలయం అండర్గ్రౌండ్ లో ఉంటుంది. బయటి నుంచి చూస్తే అస్సలు గుడి లనే కనిపించదు. బయటికి మఠం లా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ అలయంలోకి నాగ దేవత కూడా వచ్చి స్వామి వారికి నాగభరణం వలె చుట్టుకొని ఉంటుంది. కానీ ఎవ్వరికీ ఏ హాని తలపెట్టాదు.
ఇక్కడ ఒక పెద్ద చెట్టు కలదు. ఇందులోనే రాగి , మర్రి, నేరేడు చెట్టులు కలవు. ఈ ఆలయాన్ని 1882 సం || లో నిర్మించారు. ఇక్కడ శివయ్య తో పాటు శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ నారద ముని , శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాలు కూడా కలవు.
ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఎవ్వరూ నీరు అభిషేకం చేయకుండానే వాటి అంతటా అవే వస్తూనే ఉంటాయి. అస్సలు ఆ నీరు ఎప్పటి నుంచి వస్తున్నాయో అస్సలు ఆ నీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయో కూడా ఇప్పటికీ ఎవ్వరుకి తెలియదు. కానీ ఆ నీరు శివయ్య కి అభిషేకించిన తరువాత తీసుకుంటే వ్యాధులు తగ్గుతాయి అని ప్రతీతి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం 06:00 నుంచి 11:00
మధ్యాన్నం 11:00 నుంచి 05:00 వరకు బ్రేక్
సాయంత్రం 05:00 నుంచి 07:15 వరకు తెరిచి ఉంటుంది.
#Kashibugga Temple #Kishan Bhag #Hyderguda #Attapur #Hyderabad Temples #Hindu temples guide

Comments
Post a Comment